ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరు ముఖ్యమంత్రి ఆయన. అధికారం పోయాక కాంగ్రెస్‌కు జెల్లకొట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. డిపాజిట్లు కూడా రాకపోవడంతో…కొన్నాళ్ళ తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో నేను లోకల్ అంటూ రాజంపేట నుంచి ఎంపీగా బరిలో దిగారు. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. నేనే గెలుస్తాను అంటూ మళ్ళీ తాను నివసించే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా ఎన్నికలు చాలామంది సీనియర్లకు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయి. ఈసారి గెలిస్తేనే
ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అలాంటి పరిస్తితినే ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ళ క్రితం బీజేపీలో చేరిన నల్లారి కూటమి తరపున రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుకోని రీతిలో ఉమ్మడి ఎపి సిఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించి తన రాజకీయ జీవితానికి తానే చరమగీతం పాడుకున్నారు.
విభజన తర్వాత ఎపికి రాకుండా ముఖం చాటేశారు. చాలా కాలం పాటు రాజకీయ అజ్ఞాతంలో గడిపారు. బీజేపీలో చేరినా తెరవెనకే ఉండిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో చివరి నిమిషంలో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్ధిగా టికెట్ దక్కించుకున్నారు.ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నా…పెద్దగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అక్కడక్కడా ప్రచారం చేసినా తానేం చేస్తానో చెప్పకుండా తన రాజకీయ ప్రత్యర్ధి, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిచ్చారు.
సుమారు పదేళ్ల పాటు రాష్ట్రానికి రాకుండా టికెట్టు వస్తుందా రాదా అన్న సందిగ్డంలో కొట్టుమిట్టాడి ఎలాగొలా టికెట్ దక్కించుకున్నారు..కొన్ని ప్రాంతాల్లోనే కిరణ్‌కుమార్ తన ప్రచారాన్ని నిర్వహించారు. అయన పోటీ చేసిన పార్లమెంట్ పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధులు తమకు ఓటు వేయమని కోరారేగాని..ఎవరూ కూడా ఎంపికి ఓట్లు వెయ్యండని చెప్పలేదు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో అధిక శాతం ముస్లిం మైనార్టీల ఓట్లు ఉండటం … బిజేపి మైనార్టీల రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పడంతో … ఎంపికి ఓటెయ్యమని చెబితే తమ ఓట్లకు గండిపడుతుందన్న భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ వరకే ప్రచారం చేసుకున్నారు. దీనికి తోడు తన రాజకీయ ప్రత్యర్ధి, వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పోటీలో ఉండటంతో కిరణ్‌కుమార్‌కు ముందే విజయం మీద అనుమానాలు కలిగాయి. అందుకే ప్రచారం కూడా సరిగా చేయకుండానే..పోలింగ్ ముగిసిన వెంటనే ఎప్పటిలాగే పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారు.
వైఎస్ఆర్సిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పాలన, మరో వైపు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి బలమైన ప్రత్యర్ధితో పోటీ పడాల్సి రావడంతో కిరణ్‌కుమార్ భయం భయంగానే … అనుమానంగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించకపోతే ఆయన రాజకీయ కెరీర్ ముగిసినట్లే అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్ వేవ్ కనిపిస్తుండటంతో..కిరణ్ కుమార్ రెడ్డి ఏటికి ఎదురీదక తప్పదంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…