టిడిపి కంచుకోటలో వైఎస్సార్ సిపి జెండా తొలిసారి ఎగురబోతోందా….. విజయవాడలో తొలిసారి పాగా వేయబోతోందా…ఈ సారి టిడిపి అడ్డాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోందా…పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్ సిపికి దక్కని విజయవాడని ఈ సారి మాత్రం దక్కించుకోబోతోందా…ఫలితాలు ఆ దిశగానే వస్తాయంటున్నారు విశ్లేషకులు…విజయవాడ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సరళి తర్వాత వైఎస్సార్ సిపి గెలుపుపై ధీమా పెరిగింది…విజయవాడ పార్లమెంట్ స్ధానంపై సాక్షి టివి ప్రత్యేక కధనం
బెజవాడ అడ్డాను దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు వైఎస్సార్ సిపికి కలిసివచ్చాయంటున్నారు. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని ఈ సారి వైఎస్సార్ సిపి గెలవడం ఖాయమంటున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి విజయవాడ పార్లమెంట్ ని ఏ ఎన్నికలలోనూ గెలుచుకోలేకపోయింది…2004,2009 ఎన్నికలలో దివంగత సిఎం వైఎస్సార్ హవాతో విజయవాడ పార్లమెంట్ స్ధానం కాంగ్రెస్ దక్కించుకుంది…వైఎస్సార్ మరణానంతరం ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని గెలుచుకోలేకపోయింది.
1952 లో విజయవాడ పార్లమెంట్ స్ధానం ఏర్పాటు అయింది. తొలిసారి జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధి హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ విజయవాడ ఎంపిగా గెలుపొంది పార్లమెంట్ లో అడుగుపెట్టారు.ఆ తర్వాత 1957 నుంచి 1980 వరకు జరిగిన ప్రతీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1984 లో జరిగిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని టిడిపి గెలుచుకుంది.ఆ ఎన్నికలలో టిడిపి ఎంపిగ వడ్డే శోభనాధ్రీశ్వరావు గెలుపొందారు.1989 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ గెలిచింది.ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి చెన్నుపాటి విద్య విజయవాడ ఎంపిగా గెలుపొందారు.
ఆ తర్వాత మళ్లీ 1991 లో జరిగిన ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసిన వడ్డే శోభనాధ్రీశ్వరరావ ఎంపిగా గెలుపొందారు.ఆ తర్వాత 1996, 1998 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పర్వతనేని ఉపేంద్ర విజయవాడ ఎంపిగా గెలిచారు. 1999 లో జరిగిన ఎన్నికలలో మాత్రం మళ్లీ టిడిపి విజయవాడని దక్కించుకుంది.ఆ ఎన్నికలలో టిడిపి ఎంపిగా గద్దె రామ్మోహనరావు గెలుపొందారు.ఇక ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో 2004,2009 వరుసగా రెండు ఎన్నికలలోననూ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపి స్ధానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున పర్వతనేని ఉపేంద్ర అల్లుడు లగడపాటి రాజగోపాల్ వరసుగా రెండుసార్లు విజయవాడకి ఎంపిగా ఉన్నారు.
వైఎస్సార్ సిపి ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ ని టిడిపి గెలుచుకుంది..ఆ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి కేశినేని నానికి 5,92,696 ఓట్లు రాగా…వైఎస్సార్ సిపి అభ్యర్ధి కోనేరు రాజేంద్రప్రసాద్ కి 5,17,834 ఓట్లు వచ్చాయి.2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సిపి హవా నడిచింది..ఏకంగా రికార్డు స్ధాయిలో 151 అసెంబ్లీ స్ధానాలు..22 పార్లమెంట్ స్ధానాలను వైఎస్సార్ సిపి గెలుచుకుంది.కానీ విజయవాడ ఎంపి స్ధానం మాత్రం వైఎస్సార్ సిపికి దక్కలేదు.ఆ ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసిన కేశినేని నానికి 5,75,498 ఓట్లు పోలవ్వగా…45.04 శాతం ఓట్లు వచ్చాయి.
వైఎస్సార్ సిపి తరపున బరిలోకి దిగిన పొట్లూరి వరప్రసాద్ చివరి వరకు గట్టి పోటీనే ఇస్తూ 5,66,772 ఓట్లు దక్కించుకున్నారు.ఆ ఎన్నికలలో వైఎస్సార్ సిపికి 44.36 శాతం ఓట్లు వచ్చాయి..ఆ ఎన్నికలలో టిడిపికి…వైఎస్సార్ సిపికి మధ్య ఒక శాతంలోపే ఓట్ల తేడా ఉండటం విశేషం..టిడిపి అభ్యర్ధి వైఎస్సార్ సిపిపై కేవలం 8726 ఓట్లతోనే గెలిచారు.దాదాపు గెలుచుకునే పరిస్ధితి వరకు వచ్చి కేవలం పదివేల ఓట్ల తేడాలోపు ఓడిపోయిన విజయవాడను దక్కించుకోవడానికి వైఎస్సార్ సిపి ఈ సారి ముందునుంచి గట్టి ప్రయత్నమే చేసింది.సిఎం వైఎస్ జగన్ పాలన నచ్చి సిట్టింగ్ ఎంపి కేశినేని నాని టిడిపికి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరారు.చేరిన మొదట రోజు నుంచి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ బరిలోనూ గట్టిగానే ప్రచారం చేశారు..ఇక టిడిపి తరపున నాని సోదరుడు కేశినేని చిన్ని బరిలో ఉన్నారు.
2014 లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో 77.28 శాతం పోలింగ్ నమోదు అయితే 2019 నాటికి పోలింగ్ శాతం పెరిగి 78.94 శాతం నమోదైంది..ఆ ఎన్నికలలో పెరిగిన పోలింగ్ శాతం వైఎస్సార్ సిపికే అనుకూలించింది..2014 నాటికి టిడిపికి..వైఎస్సార్ సిపికి మధ్య ఆరు శాతం పైన ఓట్ల తేడా ఉంటే 2019 నాటికి అది ఒక శాతం కంటే తక్కువకి తగ్గింది.ఈ సారి పోలింగ్ శాతం 79.36 శాతం నమోదైంది..అంటే గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి దాదాపుగా ఒక శాతం వరకు పోలింగ్ పెరిగింది. ఈ సారి పెరిగిన పోలింగ్ శాతం కూడా వైఎస్సార్ సిపికే కలిసివస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు ఏడు శాతం పోలింగ్ పెరగడం విశేషం.
సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందడం వల్లే పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో విజయవాడ పార్లమెంట్ స్ధానంలో ఈ సారి వైఎస్సార్ సిపి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. అన్నదమ్ముల మధ్య జరిగిన పోరులో గెలుపెవరిదనేది అందరిలోనూ ఉత్కంఠత రేపుతుండగా…గెలుపుపై వైఎస్సార్ సిపి మాత్రం ధీమాగా ఉంది. కేశినేని నాని బరిలో గట్టి అభ్యర్ధిగా ఉండటం కూడా వైఎస్సార్ సిపికి కలిసొచ్చిందంటున్నారు. విజయవాడలో పాగా వేయడమంటే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వైఎస్సార్ సిపి హవా కొనసాగుతుందని చెబుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…