తెలంగాణలో నిన్నటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు కుంటి నడక నడిచే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పార్టీ వర్గాలు భయంతో గడుపుతున్నాయి. బీఆర్ఎస్ ను పూర్తిగా ఫినిష్ చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అట అసెంబ్లీలోనూ, ఇటు మండలిలోనూ కాంగ్రెస్ పైచేయి సాధించాలంటే బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడం ఒక్కటే మార్గమన్న చర్చ జరుగుతోంది…..
లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. మరో వారం రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. అత్యధిక స్థానాలు తామే గెలుస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.పోలింగ్ సరళిపై హస్తం పార్టీలో జోష్ పెరిగితే… గులాబీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ దెబ్బతో తమ పని అయిపోయినట్లేనని భయపడుతున్నారు. దానితో సీఎం రేవంత్ ఫుల్ అఫెన్స్ ఆడే పరిస్థితి వచ్చిందన్న చర్చ తారా స్థాయికి చేరింది. పైగా కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక రేవంత్ రెడ్డి సర్కారు పడిపోతుందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సొంత గూటికి ఠికానా లేక భయంతో గడుపుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పెద్ద సంఖ్యలో చేర్చుకుని బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు….
బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏకమొత్తంగా చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీని వల్ల చట్టపరంగా కూడా ఇబ్బందులు రావని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు….
అన్ని స్థాయిల నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మేల్యే లు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్లో చేరారు. దానం ఏకంగా కాంగ్రెస్ టికెట్ పై ఎంపిగా బరిలోకి దిగారు. ఇంకా చాలామంది బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో లోక్ సభ ఫలితాల తర్వాత 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను కాంగ్రెస్లో చేర్చుకుని బీఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనంచేసే దిశగాపావులు కదుపుతున్నారు. అయితే అంతకంటే ముందు కౌన్సిల్ లో బలం పెంచుకోవడం మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ముగ్గురుసభ్యులు మాత్రమే ఉన్నారు. 40మంది సభ్యులు ఉండే కౌన్సిల్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఉన్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం లో కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్, మహేష్ గౌడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యారు. దాంతో వారి సంఖ్య మూడు కు చేరింది. ఐతే కౌన్సిల్ సమావేశాల సందర్భంలో సభలో మెజారిటీ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం శాసనమండలిలో బలం పెంచుకోవడానికి ఆపరేషన్ మొదలు పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లను ఆకర్షించడం పై దృష్టి సారించింది.మండలిలో బీఆర్ఎస్ కు 28మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. అందులో ఇప్పటికే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు పెరిగింది.ఐతే కౌన్సిల్ లో మెజారిటీ లేకపోతే బిల్లుల ఆమోదం,సభలోచర్చల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ పార్టీ భావిస్తోంది. అందుకే శాసన మండలిలో అప్పర్ హ్యాండ్ కోసం గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బీఆర్ఎ స్ ఎల్పీలో విలీనం చేసుకున్నట్లుగానే ఇప్పుడు గులాబీ పార్టీ ఎమ్మెల్సీలను సీఎల్పీలో విలీనం చేసుకోవాలని హస్తంపార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. ఐతే చట్టసభలో ఒక పార్టీ శాసన సభా పక్షాన్ని మరో శాసన పక్షంలో విలీనం చేయాలి అంటే మూడో వంతు సభ్యులు తమను ఇతర శాసన పక్షంలో విలీనం చేయాలని తీర్మానం చేసి సభాపతికి లేఖను ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ అలాగే చేసింది. టీడీఎల్పీ, సీఎల్పీలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకుంది. ఇప్పుడు కౌన్సిల్ లో అలా జరగాలంటే 19మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బయ టకు రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే మరో ఇరవై మంది వరకు కాంగ్రెస్లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. ముందుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే నష్టమే కానీ, ప్రయోజనం లేదనుకునే నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారు. వాళ్లని లాగడం కష్టమేమీ కాదని రేవంత్ కు తెలుసు. పైగా ఆ క్రమంలో బీఆర్ఎస్ ను పూర్తిగా భూస్థాపితం చేయడం కూడా సాధ్యపడుతుందన్నది ఒక నమ్మకం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…