పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే..అక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు..బరిలో ఎవరు నిలుస్తారు ..ఇలా చాలా చర్చ జరిగింది..పోలింగ్ ముగిసింది.. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ పై ఏపార్టీ జెండా ఎగరేస్తుంది ? ఏ అభ్యర్థి గెలిచి అవకాశం ఉంది ? ఇలా కొత్త చర్చ కొనసాగుతోంది. గులాబీ పార్టీకి కంచు కోట అయిన మెదక్ పార్లమెంటు నియోజక వర్గంలో ఈ సారి జెండా ఎగరేసేది ఎవరు?
ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతోమందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దాని పై జోరుగా చర్చ సాగుతోంది..మెదక్ పార్లమెంట్ పై ఏపార్టీ జెండా ఎగరేస్తుంది ? ఏ అభ్యర్థి గెలిచి అవకాశం ఉంది? అనే మాటలు వినిపిస్తున్నాయి మెదక్ పార్లమెంటు పరిధిలో.. మెదక్ పార్లమెంటు పై ఇంత చర్చ జరగడానికి కారణం గతంలో నుండి కూడా ఇక్కడ రాజకీయ ఉద్దండులు ఎంపీ బరిలో నిలిచి దేశ రాజకీయాలను మర్చారు.మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక మినీ ఇండియా..వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తు ఉంటారు.
ఇక్కడి నుండి ఇందిరా గాంధీ ఎంపీగా పోటీ చేసి దేశ ప్రధాని కూడా అయ్యారు..మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు అందుకే ఈ స్థానానికి అంతటి క్రేజ్. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ తరపున వెంకట్ రాం రెడ్డి..కాంగ్రెస్ నుండి నీలం మధు.బీజేపీ నుండి రఘునందన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా కృషి చేసారు.ఆయా పార్టీల జాతీయ,రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారి అభ్యర్థుల గెలుపుకోసం జోరుగా ప్రచారం నిర్వహించారు.
ఎలాగైనా సరే మెదక్ పార్లమెంట్ పై జెండా ఎగురవేయాలని కసితో పనిచేసాయి మూడు ప్రధాన పార్టీలు. అందుకే చివరికి వరకు ఇక్కడ త్రిముఖ పోరే కొనసాగింది.. దీనికి తోడు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది 75.90 శాతం^ పోలింగ్ నమోదు అయ్యింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ తో చుస్తే ఈసారి 3.38 శాతం పెరిగింది.పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది ?. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు ?. అనే దాని పై బెట్టింగ్ లు కూడా జోరుగా నడుస్తున్నాయి..
మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో ఆరు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది..ఒక మెదక్ అసెంబ్లీ మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది.మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకే అనే ప్రచారం జరిగింది..కానీ కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ సీట్ ను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్ సీట్ దక్కించుకోవాలని కసిగా పనిచేసింది.దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ మెదక్ ఎంపీగా గెలవాలని గట్టిగా పనిచేశారు.
బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకివడానికి కాంగ్రెస్, బీజేపి పార్టీలు బాగానే కృషి చేసాయి..అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్లింది.బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్నీ తానై ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంటు పరిధిలో తన బస్సు యాత్రను నాలుగు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసి,ప్రచారం నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట నియోజక వర్గ ప్రజలు. ఈ ఎన్నికల్లో వీరు ఏ పార్టీ వైపు నిలిచారు..? అనే చర్చ జోరుగా సాగుతోంది.
తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజక వర్గ ప్రజలు తీర్పే కీలకంగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆపార్టీ గెలుపొందడం విశేషం. ఆ సెంటిమెంట్ దృష్ట్యా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు..సిద్దిపేట నియోజక వర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న ఆంశం పై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజక వర్గంలో 2,37,591 మంది ఓటర్లకు గాను 1,74,969 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజక వర్గంలో 2,00,125 మంది ఓటర్లకు గాను 1,64,952 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో 2,80,193 మంది ఓటర్లు కు గాను 2,25,607 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7,18,629 ఓటర్లు కు గాను 5,65, 528 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…