జగన్ ప్రజాద్రోహం

By KTV Telugu On 21 June, 2024
image

KTV TELUGU :-

ముఖ్యమంత్రి ప్రజాసొమ్ముకు కస్టోడియన్. ప్రజలు శ్రమ చేసి రూపాయి రూపాయి పన్నులుగా కడితే వచ్చే సొమ్మును అంతే జాగ్రత్తగా ప్రజోపయోగం కూడా వాడాలి. కానీ జగన్ ఐదేళ్ల పాటు ఏం చేశారు.  ప్రభుత్వ ఖజానాలోకి వచ్చే ప్రతి రూపాయి తన కోసమే అన్నట్లుగా వ్యవహరించారు. తన కోసం.. త నకుటుంబం కోసం వెచ్చించేందుకు వెనుకాడలేదు. జగన్ మోహన్ రెడ్డిన ఇంటికి యాభై కోట్లతో సోకులు చేసుకోవడం ఒక్కటే కాదు.. ఆయన బోగాలు తెలియనివిని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడివి దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. సీఎం అయినంత మాత్రాన ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా వాడుకోవచ్చా ?  బాధ్యతే ఉండదా ?

ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే.. తనకు  ప్రజల సొమ్ముపై తనకు పేటెంట్ ఉన్నట్లు ఇష్టానుసారం ఖర్చుచేసి.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాచరిక పాలన సాగించారు జగన్. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాసంక్షేమం పేరుతో  కొంత మంది లబ్దిదారుల ఖాతాల్లో వెయ్యో.. రెండువేలో జమ చేసి…  తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవైపు అప్పులు పుట్టించడంలో తనదైన టెక్నిక్‌లు ప్రదర్శిస్తూ.. తన రాజసం ఏ మాత్రం తగ్గకూడదన్నట్లు తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసును ప్రభుత్వ సొమ్ముతో అత్యంత మోడ్రన్‌గా మార్చారు. అటు రుషికొండలో టూరిజం ఆదాయానికి గండికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మరో మహల్ కట్టించారు.

తాడేపల్లిలో  ఆదిశేషగిరిరావు వేసిన వెంచర్‌లో రెండు ఎకరాల్లో జగన్ ఇల్లు కట్టుకున్నారు.  ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంటికి మొండిగోడలే ఉన్నాయి. ఆయన సీఎం అయిన తర్వాత కిటికీలు సహా మొత్తం ప్రజాధనంతో నిర్మించేసుకున్నారు. చివరికి డోర్ మ్యాట్లు కూడా  ప్రజాధనంతో కొన్నవే. ఇందు కోసం కోట్లు వెచ్చించారు. యాభై  కోట్లతో అద్భుతమైన సీఎం నివాసం నిర్మించవచ్చు. కానీ అంత మొత్తంతో తన ఇంటికి సోకులు చేయించుకుని గుట్టుగా వాడేసుకుంటున్నారు.    అక్కడ ప్రజాధనంతో నిర్మించిన డబుల్‌ లేన్‌ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరినీ అనుమతించకుండా నిషేధించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్‌ లేన్‌ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే వాటితో కేవలం తన ప్యాలెస్‌ దగ్గర మాత్రమే రోడ్డు నిర్మించారు.

జగన్‌ ఇంటి దగ్గర ఉన్న కరకట్టపై వందల కుటుంబాలు నివాసముంటాయి. ఆ మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు నానా పాట్లూ పడ్డారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఐదేళ్లుగా అటు వైపు ఎవరినీ అనుమతించలేదు. ఇక జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్‌ ఫెన్సింగ్‌ ప్రజాధనతోనే  చేయించుకున్నారు.  క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే.. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి హెచ్‌ బ్లాక్‌ నుంచి యూపీఎస్‌, కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, ఇతర సామగ్రినే అక్కడ వాడుతున్నారు.

అమరావతిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతులు లేవని కూల్చివేయించి.. తన విధ్వంస పాలన మొదలుపెట్టారు జగన్ అయితే మరోసారి సీఎం అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో విశాఖకు రాజధాని మార్చాలని రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాజప్రసాదం కట్టించారు .. దానిపై కేసులు పెడితే కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారు. 61ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారు. దానికి వెచ్చించిందంతా ప్రజల సొమ్మే.   జగన్ మోహన్ రెడ్డి తనకు పేపర్లు లేవు.. వ్యాపారాల్లేవని చెబుతూంటారు. కానీ  సాక్షి దినపత్రిక, భారతి సిమెంట్స్ ఆయనమే.   ఈ రెండు కంపెనీలకు ఐదేళ్లలో ప్రజాధనం ఎన్ని వేల కోట్లు దోచి పెట్టారో లెక్కలన్నీ బయటకు వస్తే ప్రజలు మూర్చపోతారు. సాక్షి పత్రిక సర్క్యూలేషన్‌లో డెబ్బయి శాతం ప్రజల డబ్బుతోనే.. మళ్లీ దానికి వందలకోట్లలో ప్రకటనలు.. సాక్షి ఉద్యోగులకు ఖజానా నుంచి జీతాలు .. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలు బయటకు రావాల్సి ఉంది.   ఇక భారతి సిమెంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏపీలో జరిగిన ప్రతి నిర్మాణానికి భారతి సిమెంట్స్ వాడారు.  రేటు పెంచి మరీ అందరూ కొనుగోలు చేసేలా చేశారు.

ఎక్కడికి వెళ్లాలన్నా స్పెషల్ ఫ్లైట్లే. రెండు కిలోమీటర్లకు హెలికాప్టర్ రైడ్. ప్రజాధంతో జగన్ అనుభవించిన రాజభోగాలకు అంతే లేదు.  ప్రజాధనాన్ని ఇలా సొంతానికి వాడుకున్న ఒక్కరంటే ఒక్క సీఎం కూడా చరిత్రలో ఉండరన్న విమర్శలు అందుకే వస్తున్నాయి. ముఖ్యమంత్రి అయితే మాత్రం ఇంత విచ్చలవిడిగా ప్రజాధనాన్ని సొంత ఖర్చులకు ఎలా చేసుకుంటారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.

జగన్ ను ప్రజలు ఓడించారు. కానీ ఆయన చేసిన నష్టానికి ఎవరు బాధ్యులు ?.  జరిగిపోయిన నష్టాన్ని ప్రజలే భరించాలా ?.   ప్రజాధనం పట్ల  అధికారంలో ఉండే వారికి బాధ్యత ఉండక్కర్లేదా ?

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి