దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టి వారికి రిజర్వేషన్ల ఆశలు చూపి చేసే రాజకీయాలు కొదవ లేదు. ఇప్పుడీ రిజర్వేషన్ల రాజకీయాలకు పాట్నా హైకోర్టు చెక్ పెట్టింది. చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. కులగణన పేరుతో చేసిన రాజకీయం కూడా ఈ తీర్పుతో ఓడిపోయినట్లయింది. మరి రాజకీయ పార్టీలు కొత్తదారులు వెదుక్కుంటాయా ?. రిజర్వేషన్ల రాజకీయాలు వదలేస్తాయా?
ఎన్నికల రాజకీయాల కోసం రిజర్వేషన్ల పెంపును చేపట్టే పార్టీలకు పాట్నా హైకోర్టు గట్టి సందేశాన్ని పంపింది. గతేడాది బీహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచింది. ఇది చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తున్నామని పట్నా హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పు ఒక్క బీహార్ కే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయి. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ ఒకటే. రిజర్వేషన్ల పెంపు అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజకీయం. వివిధ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండడంతో వివిధ రాష్ట్రాలు ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని ఇందిరా సాహ్నీ – యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న తీర్పు ఇచ్చింది. దీనికి మండల్ తీర్పుగా ప్రస్తావించింది.
అప్పటి నుంచి రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతంగా ఉంటూ వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఒడిశా, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశాయి. అవేమీ అమల్లోకి రాలేదు. ఇప్పుడు పట్నా హైకోర్టు మరోసారి అదే చెప్పింది. కులగణన అనేది రాజకీయ అంశం అయింది. బీహార్ ప్రభుత్వం వేగంగా కులణన చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ బీహార్లోని నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సవరించిన రిజర్వేషన్ కోటాలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నాయి. ఈ నిర్ణయం ఓపెన్ మెరిట్ కేటగిరీ నుంచి వచ్చే వారికి 35 శాతానికి పరిమితం చేసింది. ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కలిపితే 75 శాతానికి చేరుతాయి.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పాట్నా హైకోర్టు.. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపును రద్దు చేసింది. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది. ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తున్నామని పట్నా హైకోర్టు ప్రకటించింది.
రిజర్వేషన్ల పెంపు అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్న రాజకీయం. వివిధ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండడంతో వివిధ రాష్ట్రాలు ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, వాటికి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని ఇందిరా సాహ్నీ – యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు న తీర్పు ఇచ్చింది. దీనికి మండల్ తీర్పుగా ప్రస్తావించింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతంగా ఉంటూ వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఒడిశా, ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో కొన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు చేశాయి. అవన్నీ కేంద్రం వద్దకు అనుమతి కోసం పంపాయి. కానీ అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వాటికి చట్టబద్ధత లేదని కేంద్రం ఆపేసింది.
ఒక్క తమిళనాడులో మాత్రమే .. యాభై శాతానికి మంచి రిజర్వేషన్లు ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారానే తమిళనాడులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే, ఇప్పటికీ అది కోర్టుల పరిధిలో ఉంది. కోర్టు తీర్పులు ఆటంకంగా మారడంతో తాము చేసిన రిజర్వేషన్ల చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాజకీయాలకోసం.. తమ ఓటు బ్యాంకుల కోసం పార్టీలు చేస్తున్న ఈ విభజన రాజకీయంతో దీర్ఘకాలిక నష్టం దేశానికి జరుగుతోంది. కానీ రాజకీయ లాభం కోసం వారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రిజర్వేషాల రాజకీయాలు పెరుగుతూనే ఉన్నాయి.
అందరికీ సమానావకాశలు కల్పించడం రిజర్వేషన్ల లక్ష్యం. కానీ రాను రాను ఇది వేరే దారిలోకి వెళ్తోంది. ఈ తప్పులో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…