దేశ రాజకీయాల్లో 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. . అదేమిటంటే సీనియర్ రాజకీయ నేతలకు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్ల లాంటివి. ఒకరు కాదు… ఇద్దరు కాదు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చక్రం తిప్పాలనుకునే చాలా మందికి .. తిప్పిన వారికి.. గెలిచిన వారికి కూడా రిటైర్మెంట్ ఎలక్షనే. వారికి ఎంత క్రేజ్ ఉన్నా.. వయసు వారికి అడ్డం పడనుంది. మెల్లగా ఫేడవుట్ కాక తప్పని పరిస్థితి ఉంది. అంటే ఐదేళ్ల తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కొత్త నేతలే నడిపించబోతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గెలిచిన వారు పాలనలో పడ్డారు. ఓడిన వారు నెక్ట్స్ ఎలక్షన్స్ గురించి ఆలోచించడం ప్రారంభించారు. అయితే చాలా మంది ఊహించని విషయం ఏమిటంటే.. కీలక నేతలంతా వచ్చే ఎన్నికల నాటికి ఫేడవుట్ అవబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలక నేత ఎవరు అంటే ఠక్కువ వచ్చే సమాధానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడో సారి ప్రధాని అయ్యేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. మరి 2029 ఎన్నికల్లో ఆయన మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ఉండగలరా అంటే.. సాధ్యం కాకపోవచ్చు. అప్పటికి ఆయన వయసు 80కి దగ్గర అవుతుంది. బీజేపీ పెట్టుకున్న రూల్స్ సంగతి పక్కన పెడితే మోదీ పవర్ ఫుల్ లీడర్ కావొచ్చు కానీ వయసును మాత్రం జయించలేరు. అందుకే 2029 ఎన్నికల నాటికి ఆయన రాష్ట్రపతి తరహా ప్రజలతో నేరుగా సంబంధం లేదని ఉన్నత పదవులకు పరిమితమవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే మోదీ రిటైర్మెంట్పై దేశంలో చర్చ జరుగుతోంది కూడా.
ఒక్క మోదీ మాత్రమే కాదు దేశంలో దిగ్గజ నేతలుగా పేరుపడిన వారందరిదీ అదే పరిస్థితి. అందరూ 70 ఏళ్లు దాటిపోయిన వాళ్లే. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్య సమస్యలతో ఇప్పటికే రిటైర్ అయిపోయారు. ప్రస్తుత కాలంలో నిరాటంకంగా సీఎంగా ఉన్న ఒరిస్సా నేత నవీన్ పట్నాయక్ వయసు 77 ఏళ్లకు చేరింది. ఆయన అవివాహితుడు. ఒడిషా ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో అనూహ్యంగా ఆయన రాజకీయ జీవితానికి తెరపడిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన నడవడమే కష్టంగా ఉంది. ఇక నవీన్ పట్నాయక్‌కు మాత్రం ఈ సారి ఎన్నికల తర్వాత తాను ఇక ప్రత్యక్ష రాజకీయాలు చేయడం కష్టమని క్లారిటీ వచ్చేసింది. ఇక దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరు అయిన చంద్రబాబునాయుడు వయసు కూడా 74 . 2029నాటికి ఆయన కూడా 80కి దగ్గర అవుతారు. మోదీ లాగే ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ.. వయసు అందరికీ ఒకటే. ఆరోగ్యం కాపాడుకుంటే కొంత హుషారుగా ఉండవచ్చు కానీ.. వయసును ఎవరూ తగ్గించుకోలేరు. ఆయన గతంలోనే 2024 ఎన్నికలే తనకు చివరివని చెప్పుకున్నారు కూడా. వచ్చే ఎన్నికల నాటికి రేసులో ఉన్నా.. లోకేషే మొదటి స్థానంలో ఉంటారు.
ఇక ప్రధానమంత్రి రేసులో ఉన్నానని తరచూ తనకు తాను చెప్పుకుని బయటకు చెప్పడానికి సందేహించే బీహార్ సీఎం నితీష్ కుమార్ వయసు 72 ఏళ్లు. ప్రధానమంత్రి పదవి దక్కితే సరి లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయన పార్టీ బీహార్ లో రాను రాను సైజు తగ్గించుకుంటోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వయసు 2029 నాటికి 75కి చేరుతుంది. ఇప్పటికే వారసుడైన మేనల్లుడుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె ప్రభావం అంచనా వేయడం కష్టం. మొదటి సారి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ కూడా 70 ఏళ్లకు చేరుకున్నారు. 2029 నాటికి ఆయన కూడా 75 మార్క్ దాటిపోతారు. ఫరూక్ అబ్దుల్లా లాంటి వారు ఇప్పటికే స్లో అయిపోయారు. మాయవతి సంగతి చెప్పాల్సిన పని లేదు.
అయితే ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన నేతలంతా వయసు కారణంగా మెల్లగా వెనక్కి తగ్గి కొత్త తరానికి అవకాశానికి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అవకాశం అందిపుచ్చుకోవడానికి కొత్త తరం రెడీగా ఉందా లేదా అన్నది కీలకం. తనకు కూడా ప్రత్యామ్నాయం చూపించేవాడే అసలైన నాయకుడు అని ఓ సూక్తి ఉంటుంది. ఇప్పుడు రిటైరవ్వబోతున్న నేతలు.. అలాంటి ప్రత్యామ్నాయాన్ని దేశానికి అందించారా లేదా అన్నది మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే రాజకీయ నేతలు.. తమకు ప్రతాయ్నాయం ఉండకూడదని.. తాము మాత్రమే లీడర్లుగా ఉండాలని ఇతరుల్ని ఎదగనీయరు.. అది వారికే కాదు.. దేశానికి కూడా ఇబ్బందే.
యువతరం అంటే వారసులే అన్న భావన ఉంది. కానీ నేటి యువతలో కొత్త తరం చాలా వేగంగా రాజకీయాల్లో ప్రభావం చూపుతోంది. మెరుగైన నాయకత్వ దేశానికి లభించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…