తెలంగాణ బీజేపీకి ఇబ్బందులు! ఎందుకో..?

By KTV Telugu On 10 July, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందా. ఇతర పార్టీలతో పోటీ పడలేకపోతున్నారా. కాంగ్రెస్ పార్టీ చేరికలతో  బలోపేతమవుతంటే, బీజేపీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి.అసలు బీజేపీకి మాత్రమే ఉన్న చేరికల కమిటీ ఏమైంది. రాష్ట్ర నేతలు కీచులాడుకోవడం మినహా ఇంకేమీ చేస్తున్నారు. అధిష్టానం ఎదురుచూస్తున్నట్లుగా పార్టీ ఎందుకు డెవలప్ కావడం లేదు. అందుకు రాష్ట్ర నేతలు ఇస్తున్న వివరణ ఏమిటి…

గులాబీ  పార్టీ నుంచి హస్తం పార్టీకి గేట్లు తెరిచి చాలా రోజులైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిరబిరమంటూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. దీనితో తెలంగాణ బీజేపీ నేతలు తెగ టెన్షన్ పడిపోతున్న  మాట వాస్తవం. బీజేపీ కేంద్రంలో  అధికారంలో ఉన్నా ఎవరూ పార్టీ వైపు చూడటంలేదని తెగ బాధపడిపోతున్నారు. అప్పుడెప్పుడో చేరినవారు తప్ప బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ కాషాయ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గులాబీ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఒక ప్రకటన చేశారు. మరి టచ్ లో ఉన్నవారిలో కొంతమందైనా చేరాలి కదా. కానీ వెనుకాడుతున్నారట. అలా ఎందుకు చేరుతుందనేందుకు వాళ్లు ఒక కారణం చెబుతున్నారు. బీజేపీ రూల్ ప్రకారం ఆ పార్టీలో చేరాలంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలట. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరడానికి వెనుకాడుతున్నారని సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ లో ఈ రూల్ లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు.

ఏ పార్టీకైనా రూల్స్ ఒక నాటకమే అవుతుంది.  అవకాశాన్ని, అవసరాన్ని బట్టి రూల్స్ మారుతుంటాయి. ఐనా పార్టీలోకి ఎందుకు  చేరడం లేదని బీజేపీ ఆలోచించుకోవాల్సిన అనివార్యత ఉంది.

తెలంగాణలో బీజేపీకి మాత్రమే ఒక చేరికల కమిటీ ఉంది. ప్రస్తుత మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ దానికి కన్వీనర్ గా ఉన్నారు. మూడు సంవత్సరాలుగా ఆ కమిటీ నామ్ కే వాస్తే పనిచేస్తోంది. ఇప్పటిదాకా ఒక బలమైన నాయకుడిని కూడా పార్టీలో చేర్చుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో బీజేపీ వైపు చూసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని తెలుసుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని వాదించే వాళ్లూ ఉన్నారు. మరో పక్క త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపు పార్టీని బలోపేతం చేయలేకపోతే స్థానిక ఎన్నికల్లో కష్టకాలం తప్పకపోవచ్చు. ఈ లోపు కాంగ్రెస్ బలపడితే, బీఆర్ఎస్ కు ఉన్న క్షేత్రస్థాయి బలం ఆ పార్టీని నిలబెడితే బీజేపీకి కష్టకాలం తప్పక పోవచ్చు. అందుకే ఇప్పుడు టెన్షన్ పడాల్సిన  పరిస్థితి వస్తోంది.బీజేపీలో ఉన్న పెద్ద కాపులంతా తమ ఇగోలను పక్కన పెట్టి దారికి వస్తేనే బీజేపీ బతికి బట్టకట్టే ప్రమాదం ఉంది. ఎవరికి వారు ఆధిపత్యపోరును కొనసాగించి ప్రయోజనం లేదు…

ఇదీ భేషజాలకు పోవాల్సిన టైమ్ కాదు. లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచామని చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు. భవిష్యత్తు ఏమిటన్న ఆలోచనతో ముందుకు వెళ్లాలి. మరి తెలంగాణ బీజేపీ నేతలు ఆ పని చేస్తారో లేదో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి