లావణ్య, రాజ్ తరుణ్ లవ్ వ్యవహారం ఊహించని కొత్త మలుపులు తిరుగుతోంది. లావణ్య ఇచ్చిన పోలీసులు కంప్లైంట్ తో డొంక కదిలింది. నార్సింగీ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య… రాజ్ తరుణ్ తను ప్రేమించుకున్నామని చెప్పేందుకు 170 ఫోటోలతో పాటు అనేక డాక్యుమెంటరీ సాక్ష్యాలను కూడా సమర్పించింది. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో రాజ్ తరుణ్ లావాణ్యను పెళ్లి చేసుకున్నాడని ఆమె వెల్లడించింది. పెళ్ళైన రెండో నెలలోనే లావణ్యకు అబార్షన్ చేయించాడు. మళ్ళీ 2016 లో మరోసారి అబార్షన్ చేయించాడు. అంతేకాదు రాజ్‌తరుణ్‌కు తాను 70 లక్షలు ఇచ్చానని, అతని దగ్గర దా దాపు 30 కుక్కలు ఉన్నాయని, ఆ కుక్కల వల్ల 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని లావణ్య ఫిర్యాదులో రాసుకొచ్చింది. గతంలో రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్‌తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే చాన్స్ ఉంటుంది. మోసపూరిత పెళ్లి కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ తో పాటూ ఇందులో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపైనా కేసు నమోదయింది. A1గా రాజ్‌తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
లావణ్య-రాజ్ తరుణ్ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ తరుణ్‌ని వదిలేది లేదని, నన్ను బ్యాడ్‌గా చిత్రీకరించిన వారిని కటకటల్లోకి నెట్టే వరకు ఎంతవరకైన వెళతానని లావణ్య అంటుంది. రాజ్ తరుణ్ తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని లావణ్య అంటుంది.ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం తరపున 70 లక్షల వరకు ఆయనకు సాయం చేశానని చెప్పుకొచ్చింది .తనని రాజ్ తరుణ్, మాల్వీ డ్రగ్స్ కేసులో ఇరికించినట్టు లావణ్య చెబుతుంది. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని… తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్టు లావణ్య పేర్కొంది అయితే జైలు నుండి బయటకు వచ్చాకు ప్రశ్నిస్తే.. చంపేస్తామంటూ రాజ్ తరుణ్, మాల్వీ, మయాంక్ బెదిరించారని ఆమె వెల్లడించింది. ఇక మాల్వి మల్హోత్రాపై పెట్టిన కేసు గురించి స్పందిస్తూ.. మాల్వి మల్హోత్రా బ్రదర్ కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్ కి సంబంధించిన కేసు అని వెల్లడించారు.
నిజానికి రాజ్ తరుణ్ తో కాపురం చేయాలని లావణ్య అనుకుంటున్నట్లు సమాచారం. ఆయన్ను వదిలేందుకు ఆమె ఇష్టపడటం లేదు. మాల్వీ మల్హోత్రా పీడ విరగడైతే రాజ్ తరుణ్ మారతాడని అప్పుడు తను, తన భర్త సంతోషంగా గడిపే వీలుంటుందని లావణ్య ఎదురుచూస్తోంది. ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్ అందుకు సిద్దంగా లేడు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచించాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…