చంద్రబాబు తెలంగాణ మీద కన్నేశారా? త్వరలో లాగేస్తారా?

By KTV Telugu On 25 July, 2024
image

KTV TELUGU :-

చంద్రబాబు తెలంగాణ పరిస్థితుల్ని ఇక్కడ ఇప్పటివరకు అడ్వాంటేజ్ అవుతూ వస్తున్న అధికారుల్ని ఏపీ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఎలాగంటే.. ఇప్పుడు బ్యూరోక్రాట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేరళ సర్వీసులో ఉన్న కృష్ణతేజని.. కేంద్రంతో చెప్పి డిప్యూటేషన్ మీద ఏపీకి రప్పించుకున్నారు. అలాగే.. బీఆర్ఎస్ హయాంలో ఐటీ, పరిశ్రమల శాఖలో కీలకంగా వ్యవహరించిన జయేశ్ రంజన్ ను ఏపీకి ఆహ్వానించినట్లు, బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లూప్ లైన్ లో ఉన్న జయేశ్ రంజన్ ఒకప్పుడు నిత్యం ఏదో ఒక హంగామాలో పార్టిసిపేట్ చేస్తూ.. పారిశ్రామిక, ఐటీ పెట్టుబడులు, తెలంగాణ యాక్టివిటీలో కీలకంగా జయేశ్ రంజన్ కనిపించేవారు. కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగేవారు. దావోస్ లాంటి పర్యటనల్లోనూ, ఢిల్లీలో తిరిగినప్పుడు.. ఇంకెక్కడైనా ఉన్నప్పుడు జయేశ్ రంజన్‌ది హవా అంతా ఉండేది. బహుశా అందుకే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. కేటీఆర్ తో అంత సన్నిహితంగా ఉన్నారనేనేమో.. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టేశారు. మొదట్లో జయేశ్ విషయంలో కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించినట్లు అనిపించినా.. ఇప్పుడు పూర్తిగా కత్తిరించి పక్కనేశారు. ఆ తర్వాత.. మిగతా అధికారుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి, ప్రభుత్వం పెద్దగా లెక్క లేనట్లు వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారనో.. ఫలానా వాళ్లకు సన్నిహితంగా ఉన్నారనో ముద్ర వేసి.. పక్కన పెడుతున్నారు. అంతేగానీ.. వాళ్ల సామర్థ్యం ఏంటి.. వాళ్లు ఎలాంటి టాస్క్ లను కంప్లీట్ చేయగలుగుతారు.. ఈ ప్రభుత్వానికి ఏం కావాలి.. ఇలాంటివేవీ బేరీజు వేసుకున్నట్లుగా లేదు. వాళ్లు గత ప్రభుత్వంతో అంటకాగారు కాబట్టి.. వాళ్లను కోసి పక్కనేయాలే అన్నట్లుగా ఉంది. అందుకోసమే కీలక శాఖల్ని బాధ్యత అంతా తీసుకొని నడిపించిన బ్యూరోక్రాట్లు.. ఇప్పుడు ఖాళీగా వట్టి చేతులతో మిగిలిపోయారు. అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇట్లాంటి టైమ్ లో జయేశ్ రంజన్‌ని.. చంద్రబాబు ఇచ్చిన ఆఫర్.. చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ఐటీ , పారిశ్రామిక విభాగానికి.. ఒక దారి తెన్ను చూపించేందుకు, బాధ్యతలు తీసుకునేందుకు.. ముందుకు రావాలని.. ఏం అడిగితే అది చేస్తానని.. కేంద్రంతో తాను స్వయంగా మాట్లాడతానని.. అంతా తాను చూసుకుంటానని.. చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ప్రస్తుతం బీజేపీలో, కేంద్రంలో కీలకంగా ఉన్నారు.. నిధులు, మిగతా విషయాల్లో ఎలాంటి సాయం ఉన్నా.. ముందు డిప్యుటేషన్లు, అధికారుల విషయంలో కేంద్రం సహకరిస్తోంది. పైగా అమిత్ షా దగ్గర చంద్రబాబుకు ఉన్న పలుకుబడితో.. కీలకంగా పనికొస్తోంది. అందుకోసమే.. కేంద్ర హోంశాఖ ఇట్లాంటి వ్యవహారాల్లో చంద్రబాబు చెప్పగానే వెంటనే స్పందిస్తోంది. ఇదే అదనుగా.. జయేశ్ రంజన్ లాంటి వాళ్లను.. తెలంగాణ నుంచి ఏపీ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే గనక.. తెలంగాణకు బ్యూరోక్రసీ విషయంలోనే కాదు.. అడ్మినిస్ట్రేషన్ విషయంలోనూ దెబ్బపడే అవకాశం ఉంది. బహుశా.. ఇద్దరు ముగ్గురు అధికారులు గనక అటు వైపు వెళ్లిపోతే.. తెలంగాణలో కొత్త చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనో.. చంద్రబాబు దెబ్బకొట్టడం మొదలుపెట్టాడనో.. రాజకీయంగా కూడా చంద్రబాబు పేరుతో రేవంత్ మీద ఒత్తిడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి