ఆరాటం తప్ప.. పోరాటం లేదా? బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పట్లో మారరా?

By KTV Telugu On 25 July, 2024
image

KTV TELUGU :-

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ల కోసం పార్టీ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టిన నాయకులు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. పార్టీ ఆఫీసు దిక్కే రావడం మానేశారట. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు.. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీలోనూ, కార్యకర్తల్లోనూ అసంతృప్తికి దారితీసిందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయ్. అప్పుడప్పుడు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు మాత్రమే ఎమ్మెల్యేలు పరిమితమమవుతున్నారని.. ప్రజా సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయ్. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో బీజేపీ ఇమేజ్ కొంత పెరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలంటే.. పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండి పోరాటం చేస్తే.. పొలిటికల్‌గా మరింత మైలేజ్ వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. కానీ.. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఫుల్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

నిజానికి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆ ఆరేడు నెలల్లో.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే ప్రభుత్వం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ సర్కారుపై విమర్శలు చేస్తూ.. ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. ఆయనకు అండదండగా నిలవాల్సిన మిగిలిన ఎమ్మెల్యేలు.. పార్టీ ఆఫీసు వైపు కూడా రావడం లేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా.. ప్రజల తరఫున పూర్తి స్థాయిలో పోరాడటం లేదనే గుసగుసలు పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తున్నాయ్.

బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీకి ఎమ్మెల్యేల బలం పెద్దగా లేకపోయినా.. బీజేపీ నాయకులు గట్టిగా పోరాడారు. దాంతో.. రాష్ట్రంలో బీజేపీ కొంతమేర బలపడింది. కానీ.. ఇప్పుడు మాత్రం ఆ దూకుడు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇందుకు.. ఎమ్మెల్యేల తీరే అసలు రీజన్ అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఫైట్ చేసేందుకు పార్టీ క్యాడర్ రెడీగానే ఉన్నా.. ఎమ్మెల్యేల మద్దతు దొరకక నిరాశకు గరువుతున్నారట. ప్రభుత్వ విధానాలపై పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడాని పార్టీ నాయకత్వం కోరుతున్నా.. కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీుకుంటున్నారని చెబుతున్నారు. పార్టీలో సముచిత గౌరవం లేదని కొందరు అలకబూనారు. ఇంకొందరైతే.. పార్టీ ఆఫీసు వైపు అసలు కన్నెత్తే చూడటం లేదట. ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇలా పోరాటాలకు దూరంగా ఉండటంపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకముందైనా.. బీజేపీ ఎమ్మెల్యేలు తీరు మార్చుకొని.. ప్రభుత్వం పోరాడతారా? ఇలాగే.. సైలెంట్‌ తమ పని తాము చేసుకుంటూ పోతారా? అన్నది.. ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి