ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయ్. బహుశా.. ఆ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే.. ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లున్నారు జగన్. పెట్టుకున్నారు సరే.. కేంద్రం బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత.. ఆ బడ్జెట్లో ఏపీకి దోచిపెట్టేశారు, అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల సాయంతో పాటు ఐదారు కీలక అంశాల్లో అద్భుతమైన సాయం వచ్చేసింది! వెనుకబడిన ప్రాంతాలు, పోలవరం, అమరావతి, చెన్నై-విశాఖ కారిడార్.. ఇలా వీటన్నింటికి సాయం అందుతుందని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సమయంలో.. అంటే.. ఒక హైప్, పాజిటివిటీ ఉన్న టైంలో.. జగన్ ఢిల్లీకి వెళ్లడమనేది.. ఒక భీకరమైన రాంగ్ స్టెప్.
ఇటు చంద్రబాబు, అటు నితీశ్ కుమార్.. ఎన్డీయే కూటమికి వెన్నుదన్నుగా ఉండి.. తమ రాష్ట్రాలకు
అభివృద్ధి సాధిస్తున్నారనే టైంలో.. ఏపీ ప్రతిపక్ష నేత వెళ్లి.. ఢిల్లీలో మొత్తుకుంటే.. ఎవరికైనా వినబడతదా? కనబడతదా? అసలు.. ఎవడు పట్టించుకుంటాడు? ఫుల్ పాజిటివిటీ ఉన్న టైంలో.. జగన్ ఇట్లాంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? అసలు.. ఇదేం వ్యూహం.? ఇదెక్కడి వ్యూహం.?
అయినా.. బడ్జెట్ ఎప్పుడొస్తుందో.. తెలిసి ఉండాలి. బడ్జెట్లో ఏం ఇవ్వబోతున్నారో ముందే తెలుసుకోవాలి. ఇప్పటికే.. మొదటి నెల రోజుల్లో చంద్రబాబు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లారు. మీకు.. సొంత ఎంపీలున్నారు. నిన్న, మొన్నటి దాకా అధికారంలో ఉన్నారు. అలాంటప్పుడు.. ఢిల్లీలో పొలిటికల్ ఇంటలిజెన్స్ ఉండాలి. అక్కడ.. ఫాగ్ నడుస్తుందో.. లాగ్ నడుస్తుందో.. మూమెంట్ ఏముందో.. అన్నీ తెలుసుకోవాలి. ఇలాంటివేవీ లేకుండా.. ఏపీకి అన్నీ ఇచ్చేశారని తెలుస్తున్న టైంలో.. జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడమనేది పొలిటికల్‌గా రాంగ్ స్టెప్.
దీని వల్ల ఆయన చెప్పాలనుకున్నది ఎవడికీ వినపడదు. రెండోది.. ఆయనేదో పొలిటికల్ పెడబొబ్బలు పెట్టడానికి వచ్చేశాడనుకుంటారు. దాని బదులు.. ఆంధ్రా అసెంబ్లీలో నిలబడి.. ఢిల్లీలో
ఆయనేవైతే ఇన్సిడెంట్లు చెబుతున్నారో.. ఇక్కడే పేరుపేరునా ప్రస్తావించి.. దానికి కారకులెవరనుకుంటున్నారో ఆరోపించి.. సభలో నిలబడి ఫైట్ చేసి ఉంటే.. సీన్ వేరేలా ఉండేది.
ఎందుకంటే.. నిన్న మొన్నటి దాకా వైసీపీ ప్రచారం చేసింది కదా.. సింహం సింగిల్‌గా వస్తుందని.. అలాగే.. సింహం లాగా నిలబడ్డాడు అని ఓ ప్రచారం చేసుకోవడానికి, జగన్ అభిమానులు హైప్ ఇచ్చుకోవడానికి.. ఆత్మస్థైర్యం నింపుకోవడానికి.. ఎహె.. భయమెరుగని ఆ పేరుకు హడలు.. అని రీల్స్ చేసుకోవడానికి.. అవకాశం ఉండేది. ఇట్లాంటి అవకాశాన్ని వదులుకొని.. ఆయన ఢిల్లీకి వెళ్లడం.. వెళ్లిన తర్వాత.. ఆ పర్యటన తుస్సమనడం చూస్తే.. అర్రెర్రెర్రె.. ఈ మాత్రం అవగాహన లేకుండా ఎట్లా? అనిపిస్తుంది. అధికారం పోతే.. గాలి తీసిన బుడగ లాగా అయిపోయిందా వైసీపీ పరిస్థితి అనే చర్చ కూడా జరుగుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…