బెంగళూరులో కుక్క మాంసం!? ల్యాబ్ రిపోర్ట్స్‌లో షాకింగ్ విషయాలు

By KTV Telugu On 30 July, 2024
image

KTV TELUGU :-

బెంగళూరులో కుక్క మాంసం.. 3 రోజులుగా సోషల్ మీడియాలోనూ, న్యూస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన వార్త ఇది. ఈ ఒక్క న్యూస్‌.. ఇండియా మొత్తం కలకలం రేగింది. పొలిటికల్‌గానూ ఇది పెను దుమారం రేపింది. అసలు.. ఇందులో నిజమెంత? బెంగళూరులో ఏం జరిగిందో.. ఓసారి పరిశీలిస్తే.. జైపూర్ నుంచి వచ్చిన ట్రైన్‌లో 2700 కిలోల మాంసంతో కూడిన 90 ఇన్సులేట్ బాక్సులను.. బెంగళూరు పోలీసులు గత శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు.. కుక్క మాంసాన్ని తరలిస్తున్నారని ఆరోపిస్తూ.. రైట్ వింగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో.. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తర భారతంలోని రాష్ట్రాల నుంచి పార్శిళ్లను తెచ్చుకొని.. మేక మాంసం పేరుతో బెంగళూరులో కుక్క మాంసం అక్రమంగా అమ్ముతున్నారని ఆందోళనకు దిగడంతో.. ఈ వార్త సంచలనంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి.. పోలీసులు కూడా 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకటి.. మాంసం రవాణకు వ్యతిరేకంగా!కుక్క మాంసంతో కలిపి ఉండొచ్చని అనుమానిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రెండోది.. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులను అడ్డుకున్నందుకు.. గో సంరక్షకుడు పునీత్‌పై కేసు పెట్టారు. మూడోది.. బహిరంగ ప్రదేశంలో రాత్రి పూట చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని.. పునీత్‌తో పాటు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు.. కుక్క మాంసంగా అనుమానించిన మాంసాన్ని.. శాంపిల్స్ కోసం ల్యాబ్‌కు పంపారు. ఇక్కడే.. అసలు ట్విస్ట్ ఎదురైంది. అది.. కుక్క మాంసం కాదనీ.. మేక మాంసమేనని ల్యాబ్ రిపోర్ట్స్‌లో తేలింది. కానీ.. అది సాధారణంగా మనకు కనిపించే కుక్క మాంసంలా మాత్రం లేదు. అలాగైతే.. అది ఏ మాంసం?

బెంగళూరులో కుక్క మాంసం విక్రయించడం లేదని.. జైపూర్ నుంచి వచ్చింది చెవోన్ అని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. సిరోహి అనే మేక జాతికి చెందిన మాంసం అని తెలిపారు. ఈ సెరోహి జాతికి చెందిన మేకలు .. రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్ – భుజ్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయ్. వాటికి.. కొద్దిగా పొడుగై తోక.. మచ్చలు ఉంటాయి. అందువల్ల.. వీటిని అంతా కుక్కలని భ్రమపడతారు. అయితే.. మటన్, చెవాన్ సప్లై తగ్గిపోవడం వల్లే.. కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించి అమ్ముతుంటారని అధికారులు చెప్పారు.

అయితే.. ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒక్కటే. కర్ణాటకలో గొర్రెలు, మేకల లభ్యత ఎక్కువగా ఉన్నా.. చెవాన్‌ని ఎందుకు తెప్పిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎక్కడో తేడా కొడుతోందనే.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా అది కుక్క మాంసం కాదని చెప్పినప్పటికీ.. ఆ రాష్ట్రంలో రాజకీయ గందరగోళం అనేది చెలరేగుతూనే ఉంది. ఇది.. ఎక్కడిదాకా దారితీస్తుందనేదే ఆసక్తిగా మారింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి