రాజకీయాల్లో.. ఎప్పడైనా.. ఏదైనా జరగొచ్చని.. ఇవాళ అసెంబ్లీ లాబీలో జరిగిన ఓ పరిణామం మరోసారి నిరూపించింది. గద్వాల ఎమ్మెల్యే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్నాళ్లకే.. ఆయన తిరిగి గులాబీ పార్టీలోకి రావడం…రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిందనే చెప్పాలి. ఇదంతా చూశాక.. తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. ఏమైనా వికటించిందా? అనే.. అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అసలు.. తిరిగి బీఆర్ఎస్‌లో గద్వాల ఎమ్మెల్యే చేరిక.. ఇస్తున్న సిగ్నల్ ఏంటన్నదే.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటోనే.. మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారా? అధికార కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాక్‌లు తగలనున్నాయా? అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పటికే.. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లో చేరారు. అందులో.. ఒకరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. దాంతో.. బండ్ల బాటలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారా? అనే సందేహాం తలెత్తుతోంది. గద్వాల ఎమ్మెల్యే ఒక్కరే కాదు.. అసెంబ్లీలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ఎల్పీకి వచ్చారు. ఇక.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిలో.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్‌ని వీడతారనే చర్చ మొదలైంది. ఈ తాజా పరిణామాలతో.. మరికొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు.. కాంగ్రెస్‌లో వరుస అవమానాలే కారణమా? అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే.. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కలవడం లేదు. పైగా.. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఒకవేళ.. సుప్రీంలో గనక బీఆర్ఎస్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. వీళ్లందరిపై అనర్హత వేటు పడుతుంది. అప్పుడు.. మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి.. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదనే ఆలోచనలోనూ ఉన్నారని.. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇందుకు…కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మరిన్ని కీలక హామీలను నెరవేర్చకపోవడమే కారణమంటున్నారు. అలాంటప్పుడు.. బీఆర్ఎస్‌తో కొనసాగడమే బెటరనే ఆలోచనకు కొందరు ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…