కొన్ని గంటల పాటు ఉత్కంఠ చలేరేగి తర్వాత చప్పున చల్లారిపోయింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది. తెలుగు మీడియా గంటకుపైగా హడావుడి చేసింది. వంశీని ట్రీక్ చేసి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లో పెట్టారని లైవులు ఇచ్చిన మీడియా తర్వాత కాసేపు మౌనం వహించింది. చివరకు వంశీని అరెస్టు చేయలేదని ఆయన అనుచరుడు పఠాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని కథనాలు మార్చింది. వంశీ ఎక్కడున్నాడో తమకు తెలుసుని పోలీసులు చెప్పినట్లుగా కథనాలు వండి వార్చింది. త్వరలోనే వంశీని అరెస్టు చేయబోతున్నట్లు స్టోరీలు అల్లేసింది. ఇంత జరిగినా వంశీ ఎక్కడున్నాడో మాత్రం మీడియా చెప్పలేకపోయింది…
వంశీ అమెరికాలో ఉన్నాడా.. ఇండియాలో ఉన్నాడా. వంశీ అమెరికాలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయనకు అగ్రరాజ్య ప్రభుత్వం లాంగ్ టర్మ్ వీసా మంజూరు చేసింది. ఇండియాలో ఉంటే వంశీ హైదరాబాద్లో ఉన్నాడా.. విజయవాడలో ఉన్నాడా. మరే రాష్ట్రంలోనైనా ఉన్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న మాట వాస్తవం. వంశీ తమకు చిక్కలేదని పోలీసులు చెబుతున్నారంటే అతను పరారీలో ఉన్నట్లే లెక్క. వంశీ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యమూ లేదు. నిజంగా వంశీని పోలీసులు అరెస్టు చేసి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి గోల చేసి ఉండేవారు. అంటే ఇప్పుడు వంశీ సేఫ్ జోన్లోనే ఉన్నారనుకోవాలి..వంశీ ఎలా తప్పించుకోగలుగుతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే అవుతుంది…
వంశీ మామూలోడు కాదు. దేశముదురు. అందుకే ఆయన తప్పించుకోగలుగుతున్నారన్నదే ప్రశ్న. వంశీకి ఎవరో హెల్ప్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వంశీని అరెస్టు చేసిన వెంటనే ఆయన్ను ఏ1గా మార్చి కోర్టులో హాజరు పరచాలనుకున్న టీడీపీ ప్రభుత్వం నిదాన వైఖరి పాటించడానికి కూడా కొందరి జోక్యమే కారణమని తెలుస్తోంది. ఒక్కసారి అరెస్టు చేస్తే కేసుల మీద కేసులు పెట్టి బయటకు రాకుండా చేయాలన్న సంకల్పం ఉన్నప్పటికీ ఇప్పుడు నిదాన వైఖరి పాటిస్తున్నారని కూడా తెలుస్తోంది. వంశీ శ్రేయోభిలాషులైన కొందరు వ్యక్తులు టీడీపీ పెద్దలతో రాయబారం జరిపి వంశీ అరెస్టుపై కొంత జాప్యం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. కేసును డైల్యూట్ చేయాలన్న ప్రయత్నం వారిలో కనిపిస్తోంది. వంశీ ప్రోద్బలంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినట్లు ఆ కేసులో అరెస్టయిన వారిచ్చిన వాగ్మూలాన్ని మార్చగలిగితే ఆయన్ను కాపాడే అవకాశం ఉంటుందని ఒక వర్గం భావిస్తోంది. అందుకే అరెస్టు నుంచి కొన్ని రోజులు ఆపగలిగితే..ఏదైనా గిమిక్కు చేసి వంశీని కాపాడొచ్చని లెక్కలేస్తున్నారు. తర్వాత వంశీ స్వయంగా సరెండర్ అయినా త్వరలోనే బెయిల్ వస్తుందన్న నమ్మకం కలుగుతోంది. అందుకే వంశీని పోలీసులకు చిక్కకుండా కాపాడుతున్నారని అధికార పార్టీలోని ఒక వర్గం చెబుతోంది. ఏదైనా సరే అధికార పార్టీ వాళ్లు నోరు మెదపరు కదా. ఎందుకంటే వంశీ పట్ల వాళ్లకు పీకల దాకా కోపం ఉంది. తమ నాయకుడి సతీమణిని అవమానపరిచాడన్న కసి వారిలో పెరిగిపోయింది. మరి రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ టైమ్ వంశీకి చాలా కీలకం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…