లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. తనపై త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ – ఈడీ దాడులు చేయవచ్చని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఈడీ సోదాలపై తనకు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా సమాచారం అందిందని ట్వీట్ చేశారు. లోక్‌సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఈడీ దాడులు జరగొచ్చని ఆయన ఆరోపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనపై సోదాలకు సిద్ధమవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈడీలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ అధికారులు తనకు ఈ సమాచారాన్ని తెలియజేశారని రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత నెల 29 వ తేదీన తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నచ్చలేదని పేర్కొన్నారు. తనపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు చెప్పినట్లు తెలిపారు. అయితే ఈడీ అధికారులను సోదాలకు ఆహ్వానించేందుకు చాయ్, బిస్కెట్లతో సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ ట్విటర్‌లో వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఈడీ దాడులు జరగనున్నాయా. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులు.. ముందుగానే ఈ సమాచారాన్ని రాహుల్ గాంధీకి చేరవేశారా. తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వెనుక ఆంతర్యం ఏంటి. తనపై ఈడీ దాడులు జరుగుతాయని రాహుల్ గాంధీ ఏ విధంగా చెప్పారు. లోక్‌సభలో తాను చేసిన చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బడ్జెట్‌పై ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహాల పలువురిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలు రెండో శక్తి అని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ శక్తులన్నీ దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇదే సమయంలో మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని.. అందులో వీరమరణం పొందిన అభిమన్యుడిని కూడా రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో.. ఇప్పుడు దేశాన్ని కూడా ఆ ఆరుగురు అదే చేయబోతున్నారని.. రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ ఆ పద్మవ్యూహాన్ని పన్నుతున్నారని చెప్పారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ ధ్వజమెత్తారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…