దేవినేని ఉమకు కీలక పదవి ఖాయం…

By KTV Telugu On 12 August, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. కూటమి ఏర్పాటు కారణంగా ఎమ్మెల్యే టికెట్ దొరకని వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేని టీడీపీ సానుభూతిపరులు కూడా నామినేటెడ్ పదవులు కావాలని పైరవీలు చేయడంతో చంద్రబాబుకు ఇప్పుడు కత్తిమీద సాములా తయారైంది. వెంటనే అన్ని పదవులు భర్తీ చేయాలా లేక దశలవారీగా చేయాలా అన్న చర్చ వచ్చిన నేపథంలో దశలవారీగానే మంచిదన్న అభిప్రాయంతో ఈ నెల 16న మూడో వంతు పదవులకు ప్రకటన రాబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 90 నుంచి వంద వరకు పోస్టులు ఉన్నాయని, అందులో 30 నుంచి నలభై పదవులు ఇప్పుడు భర్తీ చేస్తారని చెబుతున్నారు…

నామినేటెడ్ పదవులు అంటూ కొందరి పేర్లు టీడీపీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో గానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆ పేర్లు ఫాలో అవుతూ తెగ ఆశలు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం..టీటీడీ… చైర్మన్ పదవి ఒక విజువల్ మీడియా సంస్థ అధినేతకు ఇస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అది నిజం కాకపోతే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఆ పదవి దక్కే వీలుంది. జగన్ హయాంలో జైలుకు వెళ్లిన రఘురామ.. సీఐడీ పోలీసుల దెబ్బలు కూడా తిన్నారు. వారిద్దరిని పక్కన పెడితే మాత్రం ఉత్తరాంధ్ర నేత కళావెంకట్రావును అదృష్టం వరిచినట్లే అని అంటున్నారు… కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇస్తారని అంటున్నారు. ఉమకు మైలవరం టికెట్ దక్కలేదు. ఐనా సరే పార్టీ విజయం కోసం ఆయన అహర్నిశలు పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అనుచరుడని పేరు తెచ్చుకున్నారు…

అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏపీఐఐసీ, పౌర సరఫరాల శాఖ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిన్షన్ లకు చైర్మన్లు ఖరారు చేశారు అని ప్రచారం సాగుతోంది. ప్రొద్దుటూరు టికెట్ ని త్యాగం చేసిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఆలపాటి రాజాకు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక పార్టీ పదవుల విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి ఏపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పదవిని ఇస్తారని అంటున్నారు. ఈ పదవిలో ఇప్పటిదాకా వంగలపూడి అనిత కొనసాగుతున్నారు. ఇలా చాలా పదవులు నింపాల్సి ఉండగా…. చంద్రబాబు చల్లని చూపు కోసం ఎదురుచూస్తున్న కొందరు జర్నలిస్టుల సంగతి ఏం చేయాలో అర్తం కాక టీడీపీ అధినేత తల పట్టుకుంటున్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎన్నో ఒత్తిడులు తట్టుకుని కొందరు జర్నలిస్టులు పోరాడారు. కేసులకు కూడా భయపడలేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు నడిపారు. కొందరు చంద్రబాబును పొగుడుతూ పుస్తకాలు రాశారు. వారంతా ఇప్పుడు పదవులను ఆశిస్తున్నారు. అందరికీ కాకపోయినా కొందరికైనా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సింది. ఆ దిశగా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. మిగతా వారిని మరో విధంగా కాంపెన్సేట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

వేంటనే పదవులు దక్కని వారిని ఎలా బుజ్జగించాలో కూడా ఒక ఫార్ములా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏదో విధంగా ఆర్థిక వనరులు చేకూరే విధంగా చూసుకుంటామని చంద్రబాబు తరపున వారికి హామీ వెళ్తుందని అంటున్నారు. ఫైనల్‌గా ఈ సారి అదృష్టవంతులు ఎవరో

https://youtu.be/OUt6pVrK_7o?si=8WmKVqbVie94iDMJ

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి