ఆయన చెప్పిందేమిటి ? అర్థం చేసుకుందేమిటి ?! 

By KTV Telugu On 14 August, 2024
image

KTV TELUGU :-

అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారా. గల్లా చెప్పిందేమిటి. జనానికి అర్థమైనదేమిటి.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గల్లా జయదేవ్ స్టేట్ మెంట్ ఇచ్చారా. జరుగుతున్న ప్రచారంపై అమర్ రాజా సంస్థలో చర్చ ఎటు వైపు దారి తీస్తోంది. పెట్టుబడులు పెట్టి ఉపాధికి అవకాశాలు కల్పించే కంపెనీ అధిపతి.. ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారా. అలాంటి చీప్ టెక్నిక్స్ పాటిస్తారా.. అసలేం జరిగింది…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఇక్కడ మరో ఘటన జరిగింది. అదీ రాజకీయల్లోనూ, సామాన్యుల్లోనూ చర్చనీయాంశమైంది. అసలు విషయానికి వస్తే గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అమరాజా బ్యాటరీస్ సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 9వేల కోట్లకు పైచిలుకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ బ్యాటరీ తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో నాడు అమర్ రాజా సంస్థ నిర్మించబోయే కార్యాలయాలకు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. నాటి నుంచి ఆ సంస్థ తన కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది.ఆ ఒప్పందాలలో భాగంగా లిథియం – ఆయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని అమర్ రాజా నిర్మిస్తుంది. 10 సంవత్సరాల వ్యవధిలో 9500 కోట్ల పెట్టుబడిని ఈ విభాగం మీద అమర్ రాజా పెడుతుంది. ఈ తయారీ కేంద్రంలో వేర్వేరు బ్యాటరీలు ఉత్పత్తి అవుతాయి. ఈలోగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. పెట్టుబడులను ఆహ్వానిస్తూనే.. గతంలో బీఆర్ఎస్ తో అంటకాగిన పారిశ్రామికవేత్తలను దూరం పెడుతున్నారన్న చర్చ మొదలైంది. బహుశా అందుకే గల్లా జయదేవ్ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఏర్పడిందనుకోవాల్సి వస్తోంది….

అమర్ రాజా గ్రూపు కోసం కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఇటీవల జరిగింది. 1.5 GWh బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్ -1 కూడా మొదలు పెట్టింది. అప్పుడు గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్నాయి…

శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జయదేవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోతాయన్నారు. ఒక వేళ పరిస్థితులు మారిపోతే, తనకు అనుకూలంగా లేకపోతే వేరే రాష్ట్రాన్ని వెదుక్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పైగా ప్లాంట్ సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నిజానికి గల్లా జయదేవ్ సూటిగా సుత్తిలేకుండా నిజం చెప్పారు. తమను ఇబ్బంది పెడితే వేరు దారి లేక వెళ్లిపోవాల్సి వస్తుందని అన్నారే తప్ప.. రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించలేదు. పైగా గుంటూరు ఎంపీగా పనిచేసినప్పటికీ ఆయనకు లౌక్యం తెలియదని, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదని కూడా చాలా మంది చెబుతుంటారు. వ్యూహాత్మకంగా డైలాగులు వదలడం ఆయనకు రాదు. పారిశ్రామికవెత్తలకు ఉన్న పరిమితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరోక్షంగా వివరించేందుకు ప్రయత్నించారని అమర్ రాజా సంస్థలో ఇన్ సైడర్స్ టాక్. ఏపీలో జగన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేక అమర్ రాజాను తెలంగాణకు బదిలీ చేసిన గల్లా జయదేవ్ ఎవ్వరికీ భయపడే రకం కాదని అందరికీ తెలుసు, కాకపోతే ఆయన ఎవ్వరినీ నొప్పించే రకం కాదు. చాలా పెద్ద జెంటిల్మెన్. ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ వ్యాపారం చేసుకోవాలన్నదే అమర్ రాజా ఉద్దేశం

వ్యాపార విస్తరణే అమర్ రాజా ధ్యేయం. పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. అంతే గానీ గొడవలు ఆ సంస్థకు ఇష్టం ఉండదు. అందుకే మౌనంగా ఏపీ నుంచి బయటకు వచ్చేశామని అమర్ రాజా సంస్థ అంటోంది. పైగా సీఎం రేవంత్ అంటే తమకు ఎంతో అభిమానమని కూడా చెబుతోంది… అంతే..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి