గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంవల్ల తెలంగాణలోని చెరువులు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. మరి కొన్ని రోజులు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి అని చెప్పారు
మంచిర్యాల్, నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జగిత్యాల ములుగు ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. రేపు జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు
వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెట్ల కింద ఉండకూడదు అని హెచ్చరించారు.అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాదులో వాతావరణం పొడిగా ఉన్నా సాయంకాలం వర్షం కురిసే అవకాశం ఉందన్నారు
వారం పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలు కురవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది మరోసారి భారీ వర్షం కురిసే హెచ్చరిక నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…