వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవులతో పాటు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయనున్నారు. మండలి ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖల్ని సమర్పించున్నారు. నిన్నే వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, మరో ఎమ్మెల్సీ తమ పదవులకు, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు అదే బాటలో నడుస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి పదవులకు రాజీనామా చేయనున్నారు.. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి తమ రాజీనామా లేఖల్ని అందజేయనున్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి వైఎస్సార్‌సీపీలో ఈ రాజీనామాలపర్వం మొదలైంది. ముందుగా గుంటూరు పశ్చిమం మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యలు పార్టీని వీడారు. ఆ తర్వాత మరికొందరు మేయర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఇటీవల మాజీ మంత్రి ఆళ్లనాని కూడా అదే బాటలో నడిచారు. నిన్న రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రవిల రాజీనామాలు చేశారు. ఇలా ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీని వీడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…