నటి కాదంబరి కేసులో అంతుచిక్కని నిజాలు!

By KTV Telugu On 31 August, 2024
image

KTV TELUGU :-

హిందీ నటిని విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత హింసించి, బెదిరింపులకు గురి చేసి వేధించారు అనే విషయం సోషల్ మీడియాలోను, తెలుగు టెలివిజన్ మీడియాలోను సంచలనం రేపుతున్నది. ముంబైలో ఉండే ఈ తారపై బెజవాడలో కేసు నమోదు కావడం వెనుక అనేక ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితురాలు మౌనంగా ఉండటం.. తెలుగు మీడియాలో రకరకాల కథనాలు వెలుగు చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ కేసు వెనుక మిస్టరీ విషయంలోకి వెళితే..

తెలుగు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కృష్ణా జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన పారిశ్రామిక వేత్త కుమారుడు ముంబైలోని ఓ పార్టీలో కాదంబరీ జెత్వానీని కలుసుకొన్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమెను వదిలించేకునే ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె సమ్మతించకపోవడంతో వివాదంగా మారింది.

జత్వానీ బ్లాక్‌మెయిలింగ్‌ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసిందని వైసీపీ మండిపడింది. బాధితులకు బాసటగా నిలవాల్సిందిపోయి.. బాధితులనే బెదిరింపులకు గురి చేసే వ్యూహం పన్నిందని ఆరోపించింది. జత్వానీ హనీట్రాప్‌కి బలై కోట్లకు కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలనే దోషులకు చిత్రీకరించి చంద్రబాబు సర్కార్‌ వేధింపులకు పాల్పడుతుందని విమర్శించింది.

బాలీవుడ్‌ హీరోయిన్‌గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌ చేయడం.. అనంతరం బ్లాక్‌మెయిల్‌ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్‌ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది.

ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్‌ అధికారులు కలిసి తనను వేధించారని, ఆటబొమ్మలా వాడుకుని.. అక్రమ కేసులు పెట్టారని జత్వానీ చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వైసీపీపై బురదజల్లేందుకు రెండు రోజులుగా టీడీపీ, పచ్చ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించింది. సూపర్‌ 6 హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పదోవ పట్టించేందుకు.. హనీట్రాప్‌ చేసే మహిళను తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతోందని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో నిందితురాలు అయిన జత్వానీ.. ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అవుతుందని ప్రశ్నించింది.

బాలీవుడ్‌ హీరోయిన్‌గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌ చేయడం.. అనంతరం బ్లాక్‌మెయిల్‌ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్‌ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయని.. పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీట్రాప్‌ కేసులు బుక్కయ్యాయని బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో ఆమెపై హానీట్రాప్‌ కేసులు ఉండగా.. ఏపీలో మాత్రం బాధితురాలిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది.

జత్వానీ బ్లాక్‌మెయిలింగ్‌ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసిందని వైసీపీ మండిపడింది. బాధితులకు బాసటగా నిలవాల్సిందిపోయి.. బాధితులనే బెదిరింపులకు గురి చేసే వ్యూహం పన్నిందని ఆరోపించింది. జత్వానీ హనీట్రాప్‌కి బలై కోట్లకు కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలనే దోషులకు చిత్రీకరించి చంద్రబాబు సర్కార్‌ వేధింపులకు పాల్పడుతుందని విమర్శించింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి