ముగ్గురు మంత్రులతో కానిది ఒక జెసిబి డ్రైవర్ చేసి చూపించాడు!

By KTV Telugu On 5 September, 2024
image

KTV TELUGU :-

తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. చాలా ప్రాంతాలు వరద నీటి మునిగిపోయాయి. ప్రజలు ఇళ్ల పైకెక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులు దాటుతూ కొందరు, గొర్రెల కాపరులు, కాలనీల్లో చిక్కుకున్న వారు… సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తెలంగాణలో 16 మంది, ఏపీలో 15 మంది జలప్రళయానికి బలైపోయారు. ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయి లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తక్షణమే స్పందించినా… ప్రకృతి విలయతాండవం ముందు నిలువలేకపోతున్నాయి. ఈ విపత్కర సమయంలో సాటి మనిషికి సాయం చేసేందుకు జనం కదిలారు. వరద బధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వరదబాధితులను కాపాడేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వాలంటీర్లు రాత్రింబవళ్లు ప్రాణాలు లెక్కచేయకుండా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు, పలు సంస్థలు, నేతలు… బాధితులకు ఆహార పదార్థాలు, మంచినీరు అందిస్తున్నారు.

పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌ట‌గిరి గ్రామ‌స్తులు ప్ర‌కాశ్‌న‌గ‌ర్ వంతెన‌పైకి వెళ్లారు. వ‌ర‌ద ఉధృతిని చూస్తున్నారు. అప్ప‌టికే ఆ వ‌ర‌ద పెరిగి వంతెన‌పైకి వ‌చ్చింది. దాంట్లో 9 మంది గ్రామ‌స్తులు చిక్కుకున్నారు. ఇది తెలిసినా వారిని ర‌క్షించేందుకు ఎవ‌రూ లేరు. 15 గంట‌ల పాటు ప్ర‌భుత్వ సాయం కోసం చూస్తున్నా ఎవ‌రూ రాలేదు.ఇంకొంచెం సేప‌యితే వారు ఆ వాగు ఉధృతిలో కొట్టుకుపోయే వారే. అప్పుడే హ‌ర్యానాకు చెందిన జేసీబీ డ్రైవ‌ర్ సాహ‌సం చేశాడు. వారిని కాపాడి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకురాగ‌లిగాడు.

ముగ్గురు మంత్రులు ఉండీ ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆ వంతెన‌పై ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తొమ్మిది మంది ప్ర‌భుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హెలికాప్ట‌ర్ తెప్పిస్తున్నామ‌ని చెబుతూ కాల‌యాప‌న చేశారేగానీ ఆ మంత్రులు ఒక్క అడుగు ముందుకేసింది లేదు. వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేసిందీ లేదు.

ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదలకు ఎదురెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. పోతే ఒక్కడినే, వస్తే పది మందిమి అంటూ ప్రాణాలు లెక్కచేయని జేసీబీ డ్రైవర్, సాటి మనిషి కోసం తమ ప్రాణాలు లెక్క చేయని పోలీసులు, వందల మంది ఆకలి తీర్చిన స్వచ్ఛంద సంస్థలు…. ఇలా ఈ ఆపద సమయంలో ఎంతో మంది రియల్ హీరోలు ఉన్నారు.

ఖమ్మం వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. మున్నేరు ఉద్ధృతి ఎక్కువవటంతో బ్రిడ్జిపైనే 9 మంది చిక్కుకుపోగా.. ధైర్యం చేసి వారి వద్దకు వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. పోతే తాను ఒక్కడినే పోతానని.. వస్తే మాత్రం 10 మందితో తిరిగొస్తాని చెప్పి ధైర్యంగా వరదకు ఎదురీది వారిని రక్షించాడు. జేసీబీతో వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు.

హరియాణాకు చెందిన సుభాన్‌ పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చాడు. ఎక్సకవేటర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే రెండ్రోజుల క్రితం ప్రకాశ్ నగర్‌ వంతెన దాటేందుకు ప్రయత్నించారు. భారీ వర్షాలకు మున్నేరు పోటెత్తింది. వారు సగం దూరం వెళ్లేసరికి వెంకటగిరి వైపు వరద ప్రవాహం ముంచెత్తగా వంతెనపైనే ఎటూ వెళ్లలేక ఉండిపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. హెలికాప్టర్లు తెప్పించేందుకు యత్నించింది. కానీ ప్రతికూల వాతావరణం వల్ల రక్షించటం సాధ్యపడలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ముందుకొచ్చిన సుభానీ జేసీబీ సాయంతో వారిని బయటకు తీసుకొచ్చాడు. బాధితులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా.. సుభాన్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి