వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం సోషల్ మీడియాలో కలకలo రేపుతుంది. ప్రజా ప్రతి నిధులై ఉండి ఇలాంటి వ్యవహారంతో వార్తలకు ఎక్కడo పై పలువురు
విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ కొంతకాలంగా భార్య పిల్లలకు దూరంగా మాధురి అనే స్త్రీ తో కలిసి ఉంటున్నారు. తమ తండ్రిని కలవడానికి దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు వారి ఇంటికి వెళ్లగా మాధురి అందుకు అంగీకరించలేదు. తమ తండ్రిని కలవడానికి ఎలా అడ్డుకుంటావనీ మాధురిపై దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల తర్వాత నిన్న దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీనితో ఆగ్రహించిన దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కర్ర తీసుకుని వారిని కొట్టడానికి కూడా వచ్చారు. పక్కనే ఉన్న కొంతమంది మరియు పోలీసు వాళ్లు కూడా వారిని వారించారు.
దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మాధురి స్పందించారు. సంవత్సర కాలంగా ఆయన బయటే ఉన్నపుడు భార్య పిల్లలు ఎందుకు పట్టించుకోలేదు అనవసరంగా ఇప్పుడు వచ్చి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు తనను ఎందుకు బయటకు లాగుతున్నారు తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని వారి భవిష్యత్తును చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను దువ్వాడ శ్రీనివాస్ ఆదరించారని ఆయన ఇప్పుడు తనకు ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అని ఆయనను వదిలే ప్రసక్తే లేదని త్వరలోనే తమ పెళ్ళికూడా చేసుకోబోతున్నామని వారి భార్య పిల్లలకు ఏమన్నా సమస్యలు ఉంటే వారితో తేల్చుకోవాలి కానీ నన్ను బయటకు లాగాల్సిన అవసరం వారికి లేదని అన్నారు
కాగా దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు మాధురి పిల్లలతో మా నాన్నకు ఏమి సంబంధం, ఆమె కుటుంబం ఆమె చూసుకోవాలి అంటూ స్పందించారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…