వైసీపీలో మరో వికెట్ డౌన్..జగన్‌కు వీరవిధేయుడు గుడ్ బై

By KTV Telugu On 13 September, 2024
image

KTV TELUGU :-

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘెర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ,తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లను కూడా సాధించలేకపోయింది. పార్టీ దారుణ ఓటమితో వైసీపీ కీలక నాయకులు సెలైంట్ అయ్యారు మరికొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు.

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన ఇచ్చారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడారు. తాజాగా ఈ లిస్ట్‌లో జగన్ అత్యంత సన్నిహితుడు పేరు గాంచిన సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉదయభాను ఉమ్మడి కృష్ణాజిల్లా , జగ్గయ్యపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్న సామినేని ఉదయభాను ..2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారాయన.కానీ జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ విప్‌గా మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగతా నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీలు దాటితే.. ఇక్కడ మాత్రం 15 వేలకు సామినేని ఉదయభాను తగ్గించగలిగారు.

తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సెలైంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరి వైఎస్ ఫ్యామిలీకి వీరవిధేయుడుగా ఉన్న సామినేని ఉదయభాను వైసీపీని వీడతారో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి