దేవరపై ట్రోల్స్ ఎందుకో

By KTV Telugu On 16 September, 2024
image

KTV TELUGU :-

జూనియర్ ఎన్టీఆర్ కొందరికి టార్గెట్ అయ్యారు. ఆయన నటించిన దేవర సినిమాను అడ్డం పెట్టుకుని కొందరు పనికట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. కొత్త సినిమా దేవర ట్రైలర్ వచ్చిందే తడవుగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. పైగా సినిమా రిలీజైన తర్వాత కూడా ట్రోలింగ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ మీద కోపమా, డైరెక్టర్ కొరటాల శివ మీద అక్కసా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పైగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను కంపేర్ చేస్తూ దేవర కూడా సూపర్ ఫ్లాపేనని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది…..

దేవర.. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ అయి వ్యూస్‌లో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మామూలుగానే ఎన్టీఆర్‌ మూవీ అంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి ఆ అంచనాలను దేవర అందుకోగలదా? ఇప్పటికే నెట్టింట్లోకి వచ్చేసిన ట్రైలర్‌పై రియాక్షన్స్‌ ఏంటి? అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి నటించిన ఆచార్య ఫెయిల్ కావడం ఇప్పుడు దేవరతో దాన్ని కంపేర్ చేయడం జరుగుతోంది. ఆచార్య పాదఘట్టం..దేవర సముద్రమట్టం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీయార్ బాగా ప్రొమోషన్ చేస్తున్నప్పటికీ తాజా ట్రోలింగులు ఆయన్ను, దేవర సినిమాను ఇబ్బంది పెడతాయని భావిస్తున్నారు.

ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది ఈ పాన్‌ ఇండియా మూవీ. వీఎఫ్‌ఎక్స్‌ బాలేదంటారు కొందరు, ఆంధ్రావాల టూ అంటారు మరికొందరు, అసలు ఎన్టీఆర్‌ లుకే బాగాలేదంటారు ఇంకొందరు ప్రచారం మొదలెట్టారు. పాటలు కాపీ అంటారు.. డాన్స్‌ స్టెప్స్‌ కూడా కాపీ అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు ఫిల్మ్స్‌ సర్కిల్‌లో హాట్ టాపిక్. ఇంత నెగటివ్ ట్రోలింగ్‌ మధ్య సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అస్సలు అర్థం కాని సిట్యూవేషన్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్.తెలుగులో కంటే బాలీవుడ్‌లో ఈ మూవీపై ట్రోలింగ్ ఎక్కువగా నడుస్తోంది. నిజానికి దేవర గురించి బాలీవుడ్‌లో ఇంత చర్చ ఎందుకొచ్చింది? ఎందుకింత ట్రోల్‌ చేస్తున్నారు? అనేది కాస్త అర్థం కాని విషయమేదీ కాదు. గతంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా హిందీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. వందల కోట్ల బిజినెస్ చేయడంతో బాలీవుడ్ మూవీస్ బాగా వెనుకబడిపోయాయి. ఇప్పుడు దేవర కూడా బాహుబలి, కేజీఎఫ్, ట్రిపుల్ ఆర్ తరహాలో నేషనల్ సూపర్ హిట్ అయితే కష్టమని హిందీ బ్యాచ్ భావిస్తోంది.

సినిమా ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మొత్తం 2 గంటల 58 నిమిషాల డ్యూరేషన్‌ ఉంది. ఇక దేవర మూవీ బడ్జెట్‌ 350 నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో హీరో రెమ్యూనరేషన్‌ వంద నుంచి 120 కోట్ల మధ్య ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. హీరోయిన్ జాహ్నవీ కపూర్‌ 6 నుంచి 8 కోట్లు తీసుకుంది. ఈ క్రమంలోనే మూవీ బిజినెస్‌పై కాస్త డౌట్స్ మొదలయ్యాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందు ఒక లెక్క.. ట్రైలర్ రిలీజైన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా ట్రోలింగ్ సాగుతోంది. చాలా మందికి ట్రైలర్ నచ్చకపోవడమే ఇందుకు కారణం. ట్రైలర్ చాలా చౌ చౌగా ఉందని అంటున్నారు. ఈ మూవీ డైరెక్టర్‌ కొరటాల శివపై కూడా విరుచుకుపడుతున్నారు. నిజానికి కొరటాల లాస్ట్‌ మూవీ ఆచార్యపై కూడా ఇలానే ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోల్‌కు తగ్గట్టుగానే ఆ మూవీ కూడా పాదఘట్టమైంది. మెగాస్టార్ హిస్టరీలో మెగా ఫ్లాప్‌గా మిగిలింది.

ఇక దేవరపై ఇంత నెగిటివిటి రావడానికి ఇంకా అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్‌లో పనిచేసిన హీరోలకు ఆ తర్వాత హిట్‌ పడటం అంత ఈజీ కాదన్న టాక్ ఉండనే ఉంది. రాజమౌళి హీరోలకు సరైన హిట్ పడాలంటే కనీసం నాలుగైదు సినిమాల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ విషయం అనేక సార్లు రుజువు కూడా అయ్యింది. ఇప్పుడీ ట్రెండ్‌ను ఎన్టీఆర్‌ కూడా కంటిన్యూ చేస్తారని వినిస్తోంది. ఎన్టీఆర్‌ డబుల్ యాక్షన్‌ ఇప్పటి వరకు మూడు సార్లు చేశారు. అదుర్స్‌ మినహా ఎప్పుడూ ఇది వర్కౌట్ కాలేదు. తర్వాత కొరటాల.. ప్రస్తుతం ఆయన ఫామ్‌ అంత గొప్పగా లేదు.

దేవర ట్రైలర్‌ నిజంగానే అంతగా ఆకట్టుకోలేదని టాక్. కానీ ఈ రేంజ్‌లో ట్రోల్ అవ్వాల్సినంత అవసరమైతే కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇవి నిజమైన ట్రోల్సా? లేక ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారా? అన్నది కూడా ప్రశ్నే. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయిన తర్వాత హీరోలను టార్గెట్ చేయడం కామనైపోయింది. ఒక హీరో ఫ్యాన్స్ మరొకరిని ట్రోల్ చేసి ఆనందించడం అలవాటుగా మారింది. ఇందులో రాజకీయ కారణాలు కూడా ఉండి ఉంటాయని కొందరు అనుమానిస్తున్నారు. కావాలనే ఎన్డీఆర్ ను నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్లి చంద్రబాబును కలిసి.. ఒక బ్యాచ్ కు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. పనిలో పనిగా వరద బాధితులకు సాయం కూడా ప్రకటించారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి