టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీపై ఎప్పుడూ ట్రోల్స్ వైరల్ అవుతుంటాయి. సినీ పరిశ్రమలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్స్ కురిపించిన హీరోగా యాక్షన్ కింగ్ మోహన్ బాబుకు మంచి పేరొచ్చింది. నిర్మాతగా మారిన ఆయన ఇప్పటికీ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో జరిగే రచ్చపై సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మా ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ ఒకటైతే, మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంపై మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. ఇక విష్ణు, మనోజ్‌ల మధ్య గొడవ జరిగిన వీడియో కూడా నెట్టింట ఇప్పటికీ చక్కర్లు కడుతోంది.
మంచు విష్ణు, మంచు మనోజ్‌లు గొడవపడిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో అంతా క్లియర్‌గా లేదని పబ్లిక్కు తెలిసిపోయింది. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీ గౌరవానికి పెద్ద డ్యామేజ్ అయినట్లుగా నెట్టింట కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా మరోసారి మనోజ్ చేసిన ట్వీట్ మళ్లీ మంచు ఫ్యామిలీలో అలజడి సృష్టిస్తోందని చెప్పాలి. ఆ ట్వీట్ వల్ల మరోసారి మంచు ఫ్యామిలీలో రచ్చ స్టార్ట్ అయ్యిందని అందరూ చర్చించుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఫీజులు తగ్గించాలనే విషయంలోనే కాకుండా పలు కారణాల చేత విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. దీంతో వారిని చూసి బాధ కలిగిందని, తన తండ్రి ఉన్నత విలువలతో విద్యాసంస్థలను స్థాపించారని, స్టూడెంట్స్ శ్రేయస్సుకు ఎల్లప్పుడూ తన తండ్రి ప్రాధాన్యతనిస్తాడని మంచు మనోజ్ చెప్పాడు. అంతేకాకుండా ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ లీడర్స్‌కు కూడా తన పూర్తి మద్దతును ప్రకటించారు.
ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలను మంచు విష్ణు చూసుకుంటున్నాడు. అన్నకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంటే అండగా నిలవాల్సిందిపోయి, ఆందోళనకారులకు మద్దతు ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరైతే మరోసారి మంచు బ్రదర్స్ గొడవ బయటపడిందని అంటున్నారు. ఈ విషయం చాలా దూరం వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి దీనిపై మోహన్ బాబు, మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…