ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీ, తెలంగాణ చిగురుటాకులా వణికిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో బుడమేరు వాగుతో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఎండలు కొట్టడంతో తేరుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మళ్లీ బాంబు పేల్చింది. మరో రెండు రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని.. వీటి ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. ఇప్పట్లో వర్షాలు తగ్గేలా లేవని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసారు. నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.
గత 15 రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలకు అతాలకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలకు రెండు రాష్ట్రాల్లోని ప్రజలు అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అయితే అపార నష్టం వాటిల్లింది. 33 మంది ప్రాణాలు కోల్పోవటమే కాదు.. దాదాపుగా 10 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరదలు, వర్షాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత వారం రోజులుగా వరుణడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే తాజాగా.. తెలంగాణకు హైదారాబాద్ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
ఇక ఏపీ విషయానికి వస్తే.. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ప్రస్తుతం డెహ్రాడూన్, ఒరై మీదుగా జార్ఖండ్, గోపాల్పూర్ లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం లో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. బలమైన ఉపరితల గాలులు గంటకు సుమారు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, పార్వతీపురం, అ్లలూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం పెద్దగా లేకపోయినా.. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైఋతి/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. నేడు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తెలిక పాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఉదయం ఎండకాసినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. నేడు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురువనున్నాయని.. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఈనెల 21న ఆదిలాబాద్ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, జిగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, పెద్దపల్లి, రాజ్నన సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండలు దంచికొడుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…