తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మళ్ళీ దూకుడు చూపించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారా? రాజకీయాలలో మళ్ళీ కవిత యాక్టివ్ కావడం కోసం గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోందా? వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం కవితా సన్నద్ధమవుతున్నారా? ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో జైలుకు వెళ్లడం కారణంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. దీనికోసం అధినేత కేసీఆర్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వచ్చాయని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది. అయితే రానున్న లోకల్ బాడీ ఎన్నికలను కవిత చాలా చాలెంజింగ్ గా తీసుకుంటున్నట్టు, దానికోసం ఇప్పటినుంచే ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా చర్చ జరుగుతుంది.
మళ్లీ పొలిటికల్ గా బలంగా చాలా గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న కవిత అందుకు తన సెంటిమెంటును నమ్ముకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ కావాలని భావిస్తున్న కవిత ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం.
ఇక పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన రావడంతో, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఎప్పుడు బరిలోకి దిగాలి అన్న అంశం పైన కవిత రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. పార్టీ అధినేత కేసిఆర్ తో చర్చించిన తర్వాత తన సెంటిమెంట్ అయిన బతుకమ్మ పండుగ తో రంగంలోకి దిగాలని కవిత భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను విశేషంగా ప్రచారం చేసిన కవిత తాను మళ్ళీ పొలిటికల్ గారీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా బతుకమ్మ పండుగను ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 లేదా 2వ తేదీన కవిత పొలిటికల్ రీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మహిళలను తమ వైపుకు తిప్పుకోవడానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గృహలక్ష్మి పథకాన్ని అందించి రేవంత్ సర్కార్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కవిత రీ ఎంట్రీ తో ముఖ్యంగా మహిళ లోకాన్ని ఆకట్టుకోవాలని, బతుకమ్మ సంబరాల పేరుతో ప్రజలలోకి కవిత వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహించి తద్వారా మహిళలను తమ వైపుకు తిప్పుకునేలా కవిత చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
రానున్న ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్న కవిత
ఇక పొలిటికల్ గా రీ ఎంట్రీ తో లిక్కర్ స్కాం లో తనను ఇరికించిన విధానాన్ని, బిజెపి, కాంగ్రెస్ ల అసమర్ధ పాలనను కవిత టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల నేపధ్యంలో కవిత కీలక భూమిక పోషిస్తారని కూడా చర్చ జరుగుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…