హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని రేవంత్ రెడ్డి సంకల్పించిన విషయం తెలిసిందే. నానాటికి యువత డ్రగ్స్ బారిన పడి ఎంతలా నష్టపోతున్నారో చూస్తూనే ఉన్నా ము. చాప కింద నీరులా హైదరాబాదులో మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా ,వాటిని కట్టడి చేయడమే కాకుండా ,పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలోనే హైదరాబాదులో ఏ మూల గంజాయి ఆనవాళ్లు కనపడినా పోలీసులు గాలించి బాధ్యులను కటకటాల్లోకి నె డుతున్నారు
హైదరాబాద్లోని దూల్ పేట ప్రాంతం లో ఎక్కువగా గంజాయి తయారీ, అమ్మకాలు జరుగుతుంటాయి. నగరం మొత్తం దూల్ పేట నుండి సరుకు సప్లై అవుతుందన్న వాదన కూడా గట్టిగానే వినపడుతోంది దీంతో దూల్పేట్ మీద ఎక్సై జ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా జూలై 24, 2024న ఆపరేషన్ దూల్పేట పేరుతో ఏరియా ను మొత్తం గాలించారు
అప్పటినుండి కూడా అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు జరుపుతున్న పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి దందాలో దిగినట్లుగా సమాచారం ఉన్నవారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దూల్పేటలో జొమేరా బజార్ ,దేవీనగర్, చక్కెరవాడి, జంగూర్ బస్తి, సేవాదళ్ ఇమ్లీబాగ్, బలరాం గల్లి, మాగ్రా, గంగా బౌలి మతిన్ ఖానా, చున్నికి బట్టి ఇలాంటి అన్ని ప్రాంతాలను పోలీసులు గాలించారు 8 ప్రత్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీస్లు ఈ తనిఖీలు నిర్వహించారు
గవర్నమెంట్ నుండి కఠిన ఆదేశాలు ఉండడంతో ఎంత పెద్ద వ్యక్తులనైనా కటకటాల్లో పెడుతున్నారు. ఈ గాలింపులకు భయపడి పలువురు కొంత సైలెంట్ గా ఉన్నా కూడా మరి కొంతమంది ముఖ్యంగా సంధ్య భాయ్ ఇలాంటి స్త్రీలు ఎవరికి అనుమానం రాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాత్రమే ఎన్నుకొని గంజాయి అమ్ముతున్నట్టుగా సమాచారం అందింది. పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువత కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించి డ్రగ్స్ బారిన పడకుండా చూసుకున్నప్పుడు ప్రభుత్వo చేపడుతున్న చర్యలు తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాయి