తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్…

By KTV Telugu On 30 September, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఈ నెల మెుదట్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతాలకుతలం చేశాయి. ఆ తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన వరుణుడు.. గత వారం రోజులుగా మళ్లీ పలకరిస్తున్నాడు. తాజాగా రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి.కాగా, పశ్చిమ – మధ్య బంగాళాఖాతం వద్ద, మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న రెండు ఆవర్తనాలు నేడు విలీనమై మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందంటూ వివరించారు. దీని ప్రభావం కారణంగానే రానున్న 24 గంటల్లో పశ్చిమ – మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడనున్నదని, ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని తెలుస్తుంది. తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఆదివారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గండిపేట, బండ్లగూడ, అత్తాపూర్, నాంపల్లి, అబిడ్స్, బేగంబజార్, నార్సింగి, మణికొండ, బాచుపల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, ట్యాంక్ బండ్, కుత్బుల్లాపూర్, బోరబండ, మోతినగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా నగరంలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

నైరుతి రుతుపవనాలు ఉత్తర భారత్ నుంచి తిరోగమించటం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలుగా పిలిచే ఈ పవనాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ దాటినట్లు వెల్లడించారు అక్టోబర్‌ తొలివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఈ పవనాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం బంగాళాతంలో అల్పపీడనం తరహా వాతావరణం ఉందని.. దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రాష్ట్రంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. భారీ వర్షాలకు మాత్రం ఛాన్స్

కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, నిర్మల్‌, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, మేడ్చల్‌-మలాజ్‌గిరి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అకత్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవాళ రేపు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు మూడురోజులు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం తిరోగమనం దిశ ప్రారంభమైందని.. ఈ సమయంలోనూ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలుంటాయని చెప్పింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో ఎలెక్ట్ జారీ చేసింది

ఈ మేరకు వాతావరణ కేంద్రం 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, వైయస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి