తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా లడ్డూ కల్తీ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు ఆధారాలు ఏమిటని .. ప్రభుత్వ తరపు లాయర్ సిద్ధార్థ లూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ లూధ్రా నాలుగు ట్యాంకర్ల కల్తీని నెయ్యిని గుర్తించారని అంతకు ముందు అందే కంపెనీ పంపించిన ట్యాంకర్లను ఉపయోగించారని గుర్తు చేశారు. అయితే ఆ ట్యాంకర్లలో కల్తీ జరిగిందా.. ఆ నెయ్యిని ఉపయోగించి సిద్ధం చేసిన లడ్డూలను టెస్టులకు పంపారా అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
లడ్డూ కల్తీ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సిట్ దర్యాప్తుకు ఆదేశించడంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వ సిట్ దర్యాప్తు కొనసాగింపుపైనా గురువారం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థలూధ్రాను ధర్మాసనం ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగిందన్న రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలన్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన తర్వాత ప్రకటనలు చేశారని ఇక సిట్ సమర్థంగా ఎలా విచారణ జరపగలదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఈ విచారణకు సరిపోతుందా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూ వివాదంపై ఇరువైపులా వాదనలు రికార్డు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గురువారం రోజు సిట్ విచారణ కొనసాగించాలా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తు కొనసాగింపుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై సమీక్షకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ మేరకు సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. అక్టోబర్ 3న జరిగే విచారణలో సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయం చెప్పనున్నారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు.. కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అంటే కేంద్రం ఇచ్చే అభిప్రాయం ఆధారంగా సిట్ దర్యాప్తు లేదా సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఓవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కంగుతిన్న చంద్రబాబుకు ఇది మరో సమస్యగా మారనుంది.
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోవడంతో నెయ్యి ట్యాంకర్లను టీటీడీ అధికారులు టెస్టులు చేయించారు. అందులో జంతువుల కొవ్వు కలిపినట్లుగా తేలడంతో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రకటించారు.అయితే లడ్డూ కల్తీ జరగలేదని.. దానికి ఆధారాల్లేవని కల్తీ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపించారని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని.. వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను నియమించింది. సిట్ ను కొనసాగించాలా వద్దా అన్నదానిపై గురువారం విచారణలో కీలక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు ఈ వివాదంపై మీడియాకు ఎక్కడంతో పాటు నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు లేకపోవడంపైనా సీరియస్ అయింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడం, లడ్డూల్ని ముందే పరీక్షలకు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. అదే సమయంలో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…