రజనీకాంత్ కు సర్జరీ – నిలకడగా ఆరోగ్యం

By KTV Telugu On 2 October, 2024
image

KTV TELUGU :-

వయసుతో సంబంధం లేకుండా 73 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉండే,సూపర్ స్టార్ రజినీకాంత్ నటనకు ప్రత్యేకమైన మేనరిజంకి బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రజినీ కాంత్ ఆరోగ్యం విషమంగా ఉందని వస్తున్న వార్తలు విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఆయన జనరల్ చెకప్ కోసం అప్పుడప్పుడు హాస్పిటల్ లో చేరుతుంటారు. కానీ అర్ధరాత్రి చేరడం వల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూజలు చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు

. తీవ్రమైన కడుపు నొప్పితో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో
చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ . ప్రస్తుతం రజనీకాంత్‌కు వైద్యులు చికిత్స అందించారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. మరోవైపు రజనీ ఆరోగ్యంపై ఆయన సతీమణి లత స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో కూడా ఆస్పత్రిలో చేరినట్లు, మంగళవారం రజినీకి డా. సతీష్‌ ఆదర్వంలో ఎలక్టివ్‌ ప్రొసీజర్‌ షెడ్యూల్‌ చేసి ముగ్గురు సీనియర్ డాక్టర్లు బృందం సర్జరీ పూర్తి చేసినట్లు, పొత్తికడుపు క్రింది భాగంలో స్టన్స్ వేసినట్లు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మూడు రోజుల్లో డిశ్చార్జ్ కావచ్చని వైద్యులు తెలిపారు.

అక్టోబర్ 10వ తేదీన విడుదల కానున్న వెట్టియాన్ సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు అమితాబచ్చన్ నటించారు. 32 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ లో చాలా ఉత్సాహంగా రజినీకాంత్ డాన్స్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ ,ఇంత లోనే ఏమి అనారోగ్య సమస్య వచ్చిందో అంటూ ఆందోళన చెందిన అభిమానులు రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊరట చెందుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి