కొండా సురేఖను అరెస్ట్ చేయండి

By KTV Telugu On 4 October, 2024
image

KTV TELUGU :-

డిల్లీ వేదికగా కే ఏ పాల్ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

కొండా సురేఖ నాగ చైతన్య-సమంత విడాకుల గురించి
చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి సురేఖ తీరును తప్పు పట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

అయితే ఈ విషయంపై రాజకీయ, సినీ ప్రమఖులు ముఖ్యంగా కేటీఆర్ కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొండా సురేఖ కూడా కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదలబోయేది లేదన్నారు .తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ‘‘

ఒక మంత్రి పదవిలో ఉండి కొండా సురేఖ చట్ట విరుద్ధంగా మాట్లాడారు. కొండా సురేఖకు గత ప్రభుత్వం కాల్ లిస్ట్ ఏమైనా దొరికిందా. తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా. తెలంగాణ డీజీపీ ఎందుకు కొండా సురేఖను అరెస్ట్ చేయలేదు. కొండా సురేఖను అరెస్ట్ చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి , పదవి నుంచి కొండా సురేఖను తొలగించాలి. మహిళల పట్ల చిత్తశుద్ధి లేకపోయినా కనీసం ఉన్నట్లైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి. సమంత, నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లి సారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువ అయిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీక్రెట్‌గా ఎందుకు అదానిని కలిశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.

ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌ను మర్చిపోవాలి. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇవ్వాలి. కొండా సురేఖను అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తా. తిరుపతి లడ్డూ వ్యవహరంపై సీబీఐ దర్యాప్తు జరపాలి. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం లేదా ప్రత్యేక రాష్ట్రం చేయాలి. లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశా. మధ్యాహ్నం 3:30గంటలకు కోర్టులో వాదనలు వినిపిస్తా. కొండా సురేఖతో రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో. హైడ్రాపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో అనిపిస్తుంది. దీనిపై విచారణ జరపాలి’’ అని కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి