హిందూత్వవాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న డిప్యూటీ సీఎం

By KTV Telugu On 5 October, 2024
image

KTV TELUGU :-

ఎవరి మతాన్ని వాళ్లు ప్రచారం చేసుకుంటే తప్పు లేదు. ఇతర మతాలను గౌరవిస్తే చాలన్నది మన పెద్దలు చెప్పే మాట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా మొదట్లో అలాగే ఉండే వారు. అంటీ ముట్టనట్లుగా మతం గురించి మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో సనానత ధర్మాన్ని పాటించే ఒక డివోటెడ్ హిందువుగా ఆయన మారిపోయారు. తిరుమల లడ్డూలో కల్తీ వివాదం బయట పడిన వెంటనే ఆయన ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టిన విధానం రాజకీయ మిత్రులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. పదకొండు రోజుల తర్వాత తిరుమల దర్శనానికి వెళ్లడంతో పాటు తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగం ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేసింది.

సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లను ఆయన ఏకి పారేశారు. ఇదే ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే మతాలను అడ్డు పెట్టుకొని మాట్లాడే మీరు, హిందూ సంప్రదాయాలు మంటకలుస్తున్న సమయంలో గొంతు పైకి లేపి మాట్లాడితే మీకు సెక్యులరిజం గుర్తుకు వచ్చిందా?..సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా మీకు?, మన మతాన్ని పూజించడం, ఇతర మతాలను గౌరవించడం అంటూ పవన్ కళ్యాణ్ ఎంతో ఆకర్షణీయమైన ప్రసంగంతో అదరగొట్టేసారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కూడా ఆయన గట్టి కౌంటరిచ్చారు. సనాతన ధర్మం ఒక వైరస్ అని, దాన్ని నిర్మూలిస్తామని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి మరీ విమర్శలు సంధించారు. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇస్తూ ‘ఈమధ్యనే ఒక తమిళ యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ అంటూ కామెంట్స్ చేసాడు. దానిని సమూలంగా నిర్మూలిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అతనికి ఒకటే చెప్తున్నాం, సనాతన ధర్మం ని నువ్వు నిర్మూలించలేవు, అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వే అడ్రస్ లేకుండా పోతావు’ అంటూ హెచ్చరించారు. స్టాలిన్ కు అర్థం కావాలన్న ఉద్దేశంతో పవన్ తమిళంలో కూడా మాట్లాడారు. దీనితో ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. బీజేపీ కంటే తమ నాయకుడే గట్టిగా హిందూత్వాన్ని ప్రచారం చేస్తున్నారని, మతంపై దాడి చేసి వారికి గట్టి హెచ్చరిక జారీ చేశారని వారు చెప్పుకుంటున్నారు..పనిలో పనిగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని కూడా సున్నితంగా హెచ్చరించినట్లయ్యింది. గతంలో అక్బరుద్దీన్… అయోధ్య రాముడి మీద, ఆయన తల్లి కౌశల్యాదేవీ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

నిజానికి పవన్ కల్యాణ్ ఏదో తోచితే అది మాట్లాడతారని, మనసులో పడిన మాటను ముందు వెనుకా ఆలోచించకుండా అలాగే చెప్పేస్తారని విమర్శలు ఉండేవి. ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ మెచ్యూరిటీ ఉన్న నాయకుడిగా తయారయ్యారని చెప్పుకోవాలి. ఆయన స్పీచుల్లోనూ, మతం పట్ల ఆయన అభిప్రాయాల్లోనూ ఇప్పుడు అందరికీ కావాల్సిన స్పష్టత ఉంది. ఏదో యధాలాపంగా చేసిన కామెంట్స్ తరహాలో కాకుండా… అందరికీ అర్థమయ్యేలా… ప్రతీ హిందువు మెచ్చుకునేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ, కించపరుస్తూ మాట్లాడేవారిని ఉతికి ఆరేసేందుకు ఆయన వెనుకాడటం లేదు. రాజకీయం కంటే ప్రజల మనోభావాలు ముఖ్యమని కూడా ఆయన చెప్పకనే చెబుతున్నారు. మిత్రపక్షం టీడీపీని కూడా ఆయన భయపెడుతున్నారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభకు కేవలం బీజేపీ నాయకులే హాజరయ్యారు. అలాంటి కీల‌క స‌భ‌కు టీడీపీ గైర్హాజ‌రు వెనుక‌, భ‌యమే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నూత‌న పంథా ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల‌తో పాటు ద‌ళితుల్ని, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల్ని దూరం చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. అందుకే ప‌వ‌న్ స‌భ‌కు దూరంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.బీజేపీ హిందుత్వ ఎజెండాతో ప‌వ‌న్ ముందుకెళుతున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ప్ర‌మాద‌క‌ర‌మైన గేమ్‌కు తెర‌లేపార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌నాత‌న ధ‌ర్మానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకుని, చ‌క్క‌గా పాల‌న చేయ‌కుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకిలా నాట‌కానికి తెర‌లేపారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి