అనదికార ప్రకటనతో నిరాశలో ఆశావహులు

By KTV Telugu On 7 October, 2024
image

KTV TELUGU :-

ఆరు నెలల ముందే కౌన్సిల్ ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు పట్టభద్రుల ఎన్నిక మార్చిలో జరుగుతుందని అంచనా వేయగా..తొందరపడి పార్టీలు ముందే హడావుడి మొదలెట్టేశాయి. అధికార టీడీపీలో ఆశావహులు క్యూ కట్టారు.ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్లందరూ ఎమ్మెల్సీ కోసం పైరవీలు చేశారు. కొందరు చంద్రబాబు దగ్గరకి, మరికొందరు లోకేష్ దగ్గరకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తెనాలి స్ట్రాంగ్ మేన్ గా పిలిచే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా పేరు బలంగానే వినిపించింది. మరికొందరు కూడా కర్చిఫ్ వేసేందుకు ట్రై చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత అబ్బూరు మల్లి కూడా ట్రై చేసినట్లు చెబుతారు. నారా లోకేష్ ఆయన అత్యంత సన్నిహితుడు కావడంతో మల్లికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి.అలాగే సామాజికవర్గాల వారీగా గుంటూరు జిల్లాలోనే కొందరు నేతలు ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు.అయితే చివరకు ఆలపాటి రాజాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయన తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉండగా.. జనసేన అభ్యర్థి నాదేండ్ల మనోహర్ కోసం టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని రాజాకు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇప్పుడు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటన చేయకపోయినా.. ప్రచారం ప్రారంభించుకోవచ్చని రాజాకు మౌఖికంగా చెప్పేశారు. వచ్చే నెల మొదటి వారంలో అఫిషియల్ గా ప్రకటించే అవకాశం ఉండగా.. రాజా ఇప్పుడు గుంటూరులో ఒక కార్యాలయం తెరిచారు. పలు వర్గాల నేతలు వచ్చి ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆలపాటి రాజా కార్యాలయం తెరవడానికి ఒక కారణం కూడా ఉంది..జరగబోయేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. చాలా మంది పట్టభద్రులకు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లేవు. వాళ్లందరినీ గుర్తించి ఓటర్లుగా చేర్చే ప్రక్రియ మొదలు పెట్టాలి. అందుకు ఒక టీమ్ ను సిద్ధం చేసేందుకు ఆలపాటి రాజా తన ఆఫీసు నుంచే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వైసీపీ నుంచి కృష్ణా జిల్లాకు చెందిన గౌతం రెడ్డిని ఎంపిక చేయడంతో పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలిసి.. ఆలపాటి రాజా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు..

రాజా గెలుపు సాధ్యమే అయినా పార్టీలో అసంతృప్తి ఆయనకు కాస్త ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన భయపడుతున్నారు. చాలా మంది నేతలు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాలేదు. రాజాకే ఎందుకు ఇవ్వాలి మాకు ఎందుకు ఇవ్వకూడదని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రాజా గతంలో మంత్రిగా పని చేశారని, ఆయనను అన్ని విధాలుగా గౌరవించిందని.. ఇప్పుడు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందని కొందరు వాదిస్తున్నారు. ఎప్పుడు వారికై ఛాన్స్ ఇవ్వాలా అని నిలదీస్తున్నారు. పైగా రాజా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో గుంటూరు ఎంపీ కమ్మ అయినప్పుడు ఎమ్మెల్సీ కూడా కమ్మ సామాజికవర్గం వారే ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు… చూడాలి ఏం జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి