చంద్రబాబు నాయుడు నిర్ణయం – ఏపీలో వాలంటీర్లకు శుభవార్త

By KTV Telugu On 9 October, 2024
image

KTV TELUGU :-

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది, ప్రతి గ్రామం, వార్డు పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు. ప్రతి నెలా పింఛన్ అందించడంతో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విధుల్ని నిర్వహించేవారు.

అయితే 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాగానే.. వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో, కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉంచింది.. వారి దగ్గర ఉండే మొబైల్స్ వెనక్కు తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు అప్పటి అధికార ప్రక్షానికి ప్రచారం చేయడానికే రాజీనామా చేశారంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లుగా అంచనా. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,50,000 మంది రాజీనామా చేయని వారు ఉన్నారు. వారంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
దానికి తగినట్టుగానే చంద్రబాబు నాయుడు గత క్యాబినెట్ మీటింగ్లో సమగ్ర నివేదిక ఇవ్వమని అధికారులను కోరారు వారంతా కూడా ఈ పనిని పూర్తి చేసినట్లు సమాచారం. వాలంటీర్ల జీవితంలో వెలుగులు తెస్తామని వారికి అన్యాయం చేయమని చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో అన్నారు

ఎన్నికల సమయంలో వాలంటీర్ల అంశంపై కూటమి స్పందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

దీంతో వాలంటీర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వాలంటీర్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు పలు సందర్బాల్లో స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని.. వారి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 10న అమరావతిలో నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి వాలంటీర్ల అంశంపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. వాలంటీర్ల కొనసాగింపు, వారికి గౌరవ వేతనం పెంపు అంశాలపై క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు

వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండదు కానీ వేరే శాఖలో వీరికి ఉద్యోగం కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదివేల జీతం అయితే ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి