హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా ఉన్న చెరువులు, గుంటలను ప్రభుత్వ స్థలాలను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా కూల్చివేత కార్యక్రమాలు చేస్తుంది. మొదట్లో అభినందించిన వారే ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాన్యులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి దాచుకున్న డబ్బులతో కట్టుకున్న ఇల్లు కూడా నేలమట్టం అవుతుంటే వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఈ విషయమై బట్టి విక్రమార్క స్పందిస్తూ, నదీ గర్భంలో కూడా ఇండ్ల నిర్మాణాలు చేశారని వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని, ఇటీవల విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్లోనూ ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే చెరువులను రక్షించి భవిష్యత్ తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు
మూసి పునర్జీవం కార్యక్రమంలో భాగంగా నిర్వాసితులకు అవగాహన కల్పించి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలను ఇస్తున్నామని,
ఈ కాలుష్య కాసారం ప్రక్కన బ్రతకడం కంటే శుభ్రమైన ప్రాంతంలో బ్రతకడం మంచిదని అవగాహన కల్పిస్తున్నారన్నారు
ఇప్పుడు తాజాగా ఇల్లు 25 వేల రూపాయలే కాకుండా నిర్వాసితులకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈఓ చైర్మన్ గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వo ఉత్తర్వులు జారీ చేసింది. రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు ఈ విషయంలో కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని సూచించారు
ప్రతిపక్షాలు మాత్రం మూసి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ లక్ష్యా 50 వేల కోట్ల రూపాయలను అభివృద్ధికి వినియోగించకుండా ఏమాత్రం అవగాహన లేకుండా హైడ్రా పేరుతో కూల్చివేతల చేపడుతున్నారని భారీ స్కాం కు స్కెచ్ వేసినట్లుగా చెప్తూ వారి ఆటలను సాగనీయమని పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్తున్నారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…