రతన్ టాటా మరణం యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఎందుకంటే మూడు రోజుల క్రిందటే నేను క్షేమంగా ఉన్నాను నాకోసం ఎవరు బాధపడకండి రూమర్స్ నమ్మకండి అని చెప్పిన మనిషి నేడు లేరు అనుకుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది.
86 సంవత్సరాల రతన్ టాటా ఎన్నో సంచలనాలకు మారు పేరుగా నిలిచారు. సాల్ట్ నుండి సాఫ్ట్వేర్ వరకు గుండు సూది నుండి విమానాలు వరకు ఎదిగిన బ్రాండ్ ప్రపంచంలో టాటా గ్రూప్ అనే చెప్పాలి. దాదాపు 156 సంవత్సరాలు నుండి వ్యాపార రంగంలో ఉన్న వీరి కుటుంబం ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లింది ప్రస్తుతం ఈ గ్రూప్ కంపెనీల మార్కెట్ కాప్ 34 లక్షల కోట్ల రూపాయలు
రతన్ టాటా మరణంతో అతని వారసులు ఎవరు అనేది అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. రతన్ టాటా బ్రహ్మచారి కాబట్టి అతనికి పిల్లలు లేరు.
టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుండి రతన్ టాటా 2017 లోనే తప్పుకున్నారు. టి సి ఎస్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కు బాధ్యతలు అప్పగించారు. 66% శాతం వాటాలు టాటా కుటుంబం నిర్వహించే పలు సేవా సంస్థల పేరిట ఉన్నాయి.
రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా కు ముగ్గురు పిల్లలు. వారు లియా టాటా, మాయా టాటా, నెవిల్లె టాటా, వీరు ముగ్గురు కూడా టాటా గ్రూప్ లో వివిధ నిర్వర్తిస్తున్నారు
అబ్బాయి కావడం వల్ల టాటాల వారసుడు నెవిల్లే టాటా అని కొందరు అంటున్నారు. వీరు మాత్రమే కాక టాటాలతో బంధుత్వం కలిగి ఉన్న షాపూర్ జి పల్లోంచి వారసులు కూడా టాటా సన్స్ లో వాటాదారులుగా ఉన్నారు. టాటా గ్రూప్ లో ఉన్న నిబంధనల ప్రకారం బోర్డు నిర్ణయం మేరకే వారసులను నిర్ణయిస్తారు అలాగే రతన్ టాటా పేరిట ఉన్న పేర్లను ఎవరికి బదిలాయించాలి అనేది ఆయన వీలునామాని బట్టి నిర్ణయం తీసుకుంటారు
వీలునామాలో రతన్ టాటా ఎవరిని తన వారసులుగా నిర్ణయించారో ఇంకా తెలియ రాలేదు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…