ఆయన కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడే. తర్వాత కాలంలో కమ్యూనిజం తగ్గించుకుని ఏవో పిచ్చిపిచ్చిపనులకు తెరతీశారు. గాంధీ జయంతి రోజున చికెన్ తినడంతో ఆయన్ను ఇప్పుడు చికెన్ నారాయణ అని పిలుస్తున్నారు. దానికి ఆయన ఎంతో ఆవేదన చెందిన మాట వాస్తవం. చినగంజాం నుంచి చీరాల దాకా పాదాయాత్ర చేసినప్పుడు వేలాది మంది అభిమానులు వస్తే.. ఆ సంగతి రాయకుండా…తెలుగు మీడియా .. ఒక్క చికన్ ను మాత్రమే హైలైడ్ చేసిందని నారాయణ వాపోయిన సందర్భాలున్నాయి. అదంతా బూర్జువా పత్రికల సృష్టేనని నారాయణ తన పార్టీ వారి దగ్గర ఆవేదన కూడా చెందారనుకోండి.. అది వేరే విషయం..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా.. సీపీఐలో నారాయణ ఒక వెలుగు వెలిగారు. పార్టీ దెబ్బతిన్న తర్వాత ఆయన కూడా చప్పబడ్డారు. ఐనా ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యదర్శి వర్గం సభ్యుడిగా ఉంటూ.. అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపిస్తారు. ఎక్కువ సమయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు..
నారాయణ నిన్నా, నేడు, రేపు… బిగ్ బాస్ ప్రోగ్రాంకు వ్యతిరేకమే…నారాయణ మొదటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మీద కూడా నారాయణ షాకంగ్ కామెంట్స్ చేస్తునే ఉన్నారు. గత సీజన్లలో ఓ సారి గొడవ జరిగి పల్లవి ప్రశాంత్ బ్యాచ్ వచ్చి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కార్లు, పక్కన ఉండే ఆర్టీసీ బస్సులను పగులగొడితే నారాయణ చాలా సంతోషించారు. హీరో నాగార్జున మన యువతను చెడగొడుతున్నారని, ఆయనకు తగిన శాస్తి జరిగిందని అప్పట్లో నారాయణ కామెంట్ చేశారు. బిగ్ బాస్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని నారాయణ కోర్టులో కేసు కూడా వేశారు. గ్రామీణ ప్రాంతాల రైతు బిడ్డలను సైతం బిగ్ బాసుకు తీసుకొచ్చి చెడగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పుడు మరోసారి నాగార్జునపై నారాయణ సెటైర్లతో కూడిన అటాక్ చేశారు. మంత్రి సురేఖ చేసిన ఆరోపణలతో నాగార్జున తన పరువు పోయిందని నాంపల్లి కోర్టులో కేసు వేశారు. దానిపైనే నారాయణ స్పందించారు. పరువు ఉన్నోడు కదా.. నాకు పరువు పోయింది.. నాకు పరువు పోయింది.. అని ఏడు స్తాడు. నాగార్జునకు పరువు ఉందా?….అని నారాయణ ప్రశ్నించారు. పరువు ఉన్నోడు పరువు నష్టం దావా వేయాలని, బిగ్బాస్ షో చేయడం ద్వారా… నాగార్జున పరువు ఎప్పుడో పోగొట్టుకొన్నాడని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసే హక్కు నటి సమంతకు మాత్రమే ఉందని నారాయణ తీర్పు చెప్పారు. ఆమె పరువు నష్టం దావా వేస్తే.. తమకు మద్దతుగా నిలిచేందుకు మహిళా సంఘాలు కూడా వస్తాయన్నారు.మరి ఇప్పటికైనా నాగార్జున స్పందించి నారాయణ ఆరోపణలకు సమాధానం చెబుతారేమో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…