దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఈ పూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది.
మరోవైపు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో.. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దీంతో దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. మాల ధారణ తో వచ్చిన భవానీలు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ రోజు దుర్గమ్మ వారికి నిర్వహించాల్సిన హంస వాహనంపై ఊరేగింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులోభాగంగా దుర్గా ఘాటులోని కృష్ణా నది ఒడ్డున హంస వాహనంపై గంగా సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ఆలయ పురోహితులు కైంకర్యాలు నిర్వహించనున్నారు. కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహ గరిష్ట స్థాయిలో ఉంది. ఎగువ నుంచి దాదాపు 40 క్యూసెకుల వరద నీరు కృష్ణానదిలో ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మ వారి జల విహారాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…