ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన చెల్లెలు షర్మిలా రెడ్డి మధ్య ఆస్తి తగాదాల్లో బయటపడిన మరో అంశం సరస్వతీ పవర్ వ్యవహారం. సొదరి షర్మిలా రెడ్డి, తల్లి వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి కలిసి బదిలీ చేసుకున్న కోటి 20 లక్షల షేర్లను వెనక్కి ఇప్పించాలని జగన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్యిబ్యునల్ లో కేసు వేయడంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అసలు కంపెనీ ఏమిటి, దాని వృత్తాంతం ఏమిటి అన్న ప్రశ్నలు ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతున్న తరుణంలో పూర్తి వివరాలు అందించేందుకు కేటీవీ ప్రయత్నిస్తోంది….ప్రజల సొమ్మును ఎలా తమ పేరుకు మార్చుకోవాలని చూశారు. ఇప్పుడు ఎలా కొట్టుకుంటున్నారో చెప్పేందుకే ఈ ప్రయత్నం…
ప్రస్తుతం జరుగుతున్న అంశాలే ఒక సారి చూస్తే.. సరస్వతి పవర్ షేర్లను తల్లికి చెల్లికి ఇచ్చేందుకు జగన్ రెడ్డి 2019లో ఒక మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ చేసుకున్నారు.అది తన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో, వాత్సల్యంతో షేర్లు వారికి ఇస్తున్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు 2024లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో తాను ఇద్దామనుకున్న షేర్లను వెనక్కి ఇప్పించాలని ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఇటీవలి కాలంలో షర్మిల తీరు తనను ఆవేదనకు గురిచేసిందని అందుకే తాను, తన భార్య భారతీ రెడ్డి అప్పట్లో దశల వారీగా….ఆ ఇద్దరికీ బదలాయించిన కోటి 20 లక్షల షేర్లను వెనక్కి ఇప్పించాలని ఎన్సీఎల్టీలో జగన్ కేసు వేశారు. సరే దీనికి షర్మిల కూడా కౌంటర్ వేశారు. ఈ కేసు చాలా రోజులు కొనసాగడం కూడా ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అదే సమయంలో ఒక టెక్నికల్ అంశాన్ని కూడా జగన్ రెడ్డి ప్రస్తావించారు. తాను ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ వాళ్లే షేర్లు బదలీ చేసుకున్నారని అందుకే ఇప్పుడు వాటిని వెనక్కి ఇప్పించి… తనను తన భార్యను సరస్వతీ పవర్ లో 51 శాతం షేర్ హోల్డర్లుగా గుర్తించాలని జగన్ కోరుతున్నారు…
అన్నా, చెల్లి కొట్టుకోవడం సరే… అసలు సరస్వతీ పవర్ అంటే ఏమిటి. ఆ కంపెనీ ఏం చేస్తుంది. వాటి ఉత్పత్తులు ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న. జనం అందరినీ వేధిస్తున్న ప్రశ్న కూడా అదే.. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లెక్కల ప్రకారం ఆ కంపెనీ పూర్తి పేరు సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. 1999లో అది ప్రారంభమైంది. అంటే స్టార్ట్ అయి కూడా పాతికేళ్లు అయిపోయింది. ఆ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం ఎప్పుడు జరిగిందో కూడా రికార్డుల్లో లేదు. 2022 తర్వాత కంపెనీ బ్యాలెన్స్ షీటును పబ్లిక్ డొమైన్ లో ఉంచ లేదు. కంపెనీ దగ్గర రికార్డుల ప్రకారం షేర్లున్నాయే కానీ దాని విలువ 650 కోట్లు అని చెబుతున్నారే కానీ.. కంపెనీలో ఎంత డబ్బు ఉంది.. ఇంత వరకు ఎంత మంది ఉద్యోగులున్నారో తెలియదు.. అసలు విషయానికి వస్తే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన మొదటి రోజునే సరస్వతీ పవర్ కు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉండే దాచేపల్లి మండలం.. వేమవరం, తంగేడ గ్రామాల్లో 613 హెక్టార్ల భూమి లీజుకు ఇచ్చారు. అంటే 1514 ఎకరాలను 30 ఏళ్ల లీజుకు ఇచ్చారు. అనేక కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్షి సెక్రటరీగా ఆ లీజ్ డీడ్ పై సంతకాలు చేశారు. మొదటి రెండు సంవత్సరాలకు హెక్టారుకు వంద రూపాయలు తర్వాతి 28 సంవత్సరాలకు హెక్టారుకు నాలుగు వందల రూపాయలు చెల్లించే విధంగా లీజు డీడ్ అమలైంది.లీజు డీడ్ తర్వాత జగన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి .. ఆ కంపెనీకి డైరెక్టర్లు అయ్యారు. మిగతా వారంతా ఎవరికీ తెలియని పేర్లేనని చెప్పాలి. వారిని ఎవరూ గుర్తు పట్టరు… జగన్, భారతీ కలిసి కంపెనీ షేర్లు కొనుక్కున్నట్లు రాశారు. ఇదీ సుదీర్ఘకాలం పథకం ప్రకారం జరిగిన చర్యగా చెప్పుకోవాలి.
అయితే 2014లో చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత లీజును రద్దు చేశారు. అందుకు కారణం కూడా ఉంది. లీజుకు ఇచ్చిన రెండు సంవత్సరాల్లో కంపెనీ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. దానితో నిబంధనల ప్రకారం దాన్ని రద్దు చేశారు. కథ అంతటిలో ఆగిపోలేదు. లీజు పోయినా కంపెనీ కొనసాగింది. 2019లో జగన్ అధికారానికి వచ్చిన తర్వాత సరస్వతీ పవర్ ఫైలును దుమ్ము దులిపారు. అదే 613 హెక్టార్ల భూమిని ఏకంగా 50 సంవత్సరాలకు లీజకు ఇచ్చారు. అదీ కూడా కేవలం నామమాత్రం లీజు అని చెప్పాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ జరగాలి. మరి కంపెనీ లెక్కల ప్రకారమే ఇప్పుడ అక్కడ ఏ కార్యకలాపమూ జరగడం లేదు.ప్రజల ఆస్తిగా ఉన్న 613 హెక్టార్లు అంటే 1514 ఎకరాలు కారు చౌకగా వైఎస్ కుటుంబ పరమైందని చెప్పాలి. లైమ్ స్టోన్ తో సిమెంట్ కంపెనీలకో మరే ఇతర కార్యకలాపాలకో పనులు సాగాలి. అక్కడ ఏ పని జరుగుతున్న దాఖలాలు లేవు. కనీసం రైతులకు ఇచ్చినా సాగు చేసుకునే వారు. జగన్ రెడ్డి కుటుంబం ఆ పని కూడా చేయకుండా ఖాళీగా ఉంచింది. అంటే ఏదోక రోజున ఆ స్థలాన్ని పూర్తిగా సొంతం చేసుకునేందుకు ప్లాన్ వేశారనుకోవాలి. జగన్ రెడ్డి ఇంకా అధికారంలో కొనసాగి ఉంటే ఆ ప్రభుత్వ స్థలం ఏమై ఉండేదో ఎవ్వరూ చెప్పలేరు…
ఇప్పుడు ఈడీ కేసులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలోనే అన్నా, చెల్లీ ఆ కంపెనీ షేర్ల కోసం కొట్టుకుంటున్నారు. ఖచితంగా చెప్పాలంటే సమస్య కంపెనీ షేర్లు కాదు.. త్వరలో భారీగా విలువ పెరిగిపోయే స్థలాన్ని స్వాధీనం చేసుకునేందు కోసం ఈ షేర్ల ముసుగులో కొట్టుకుంటున్నట్లు నటిస్తున్నారని కూడా అనుకోవాలి. అంతే కానీ షేర్లు బదలాయిస్తే జగన్ బెయిల్ రద్దు అవుతుందనేది కూడా ఒట్టి మాటే కావచ్చు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…