కొలిక్కివస్తున్న తెలంగాణ నాయకత్వ మార్పు…

By KTV Telugu On 1 November, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికల తర్వాత వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్ష పదవిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర శాఖ అధ్యక్షిడిగా ఉన్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించేందుకు వేట కొనసాగుతోంది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న తరుణంలో అందరినీ కలుపుకుపోయే ఫైర్ బ్రాండ్ నాయకుడిపై అధిష్టానం దృష్టి పడింది..

జమిలి ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన తెలంగాణా మీదనే బీజేపీ ఆశలు అధికంగా ఉన్నాయి. ఏపీలో జనసేన టీడీపీతో బంధం పటిష్టంగా ఉంది. దాంతో ఏ ఢోకా లేదు. తెలంగాణాలో 2024 ఎన్నికల్లో ఎనిమిది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మరింతగా బలపడాలని లెక్కలు వేసుకుంటోంది. ఇక తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా జి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన ప్రస్తుతం రెండు బాధ్యతలను మోస్తున్నారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్తవారిని ఎంపిక చేయాలని బీజేపీ చూస్తోంది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి మరో మారు పార్టీ పగ్గాలు అప్పగించాలని కూడా టాక్ నడుస్తోందిట. ఆయన హయాంలో పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్లిందని, సంజయ్ దూకుడు కారణంగానే యువత బీజేపీ వైపుకు ఆకర్షితులయ్యారని అధిష్టానం విశ్వసిస్తోంది. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలను తట్టుకుని నిలబడే నాయకుడిగా బండి సంజయ్‌కు మంచి పేరు ఉందని కూడా అధిష్టానం ఒక అంచనాకు వచ్చింది.

నిజానికి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా చాలా కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బండి సంజయ్‌కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే స్టేట్‌లో పార్టీ డెవలప్ అవుతుందని పెద్దలు నమ్ముతున్నారు. అప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అదే టైమ్‌లో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిలో పార్టీ పరంగా మరో పదవి కూడా అప్పగించే ఛాన్సుంది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే అన్ని గ్రూపులు ఒక తాటిపైకి వస్తాయన్న నమ్మకం కూడా ఉంది. సంజయ్ నేతృత్వంలో పనిచేసేందుకు ఎవరికీ అభ్యంతరం లేదని చెబుతున్నారు…స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకోవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి