వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్…

By KTV Telugu On 4 November, 2024
image

KTV TELUGU :-

నటి కస్తూరి శంకర్… తరచూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. తనది కాకపోయినా తనకు సంబంధం లేకపోయినా ఆమె ఏదోక కామెంట్ చేస్తుంటారు. అన్నమయ్య సినిమా ద్వారా తెలుగునాట ఫేమస్ అయిన కస్తూరి… తర్వాత గృహలక్ష్మి అనే తెలుగు సీరియల్ లో కూడా నటించారు. నటిగా మంచి పేరు ఉన్నప్పటికీ.. పొలిటికల్ కామెంటేటర్ గానూ, పోరాట యోధురాలిగానూ పేరు తెచ్చుకోవాలన్న తపనతో ఆమె ఏదేదో మాట్లాడేస్తుంటారు. తమిళనాడు బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కస్తూరి ఇప్పుడో క్రేజీ కామెంట్ చేశారు. అది వీర లెవల్లో ట్రోలింగ్ కావడంతో ఆమెకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతోంది….

‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను కస్తూరి ప్రశ్నించారు.ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ‘ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది. నేను నాలుగేళ్ళుగా హైదారాబాద్ లో ఉంటున్న.ఇక్కడున్న కోందరిని మీరందరూ ద్రావిడ వాదుల అని అడిగితే అంటే ఎంటి అని అడిగారు. మీకంటే ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు తమిళనాడులో పదవుల్లో ఉన్నారంటే. అవును కదా వారు కూడా రెడ్డిగారు కధ అని అంటున్నారు. అలా ఐదుగురు మంత్రులు తెలుగువారు డిఎంకే ప్రభుత్వం ఉన్నారు’ అని కస్తూరి వ్యాఖ్యానించారు..

కస్తూరి అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని తమిళనాడు తెలుగు వారు మండిపోతున్నారు. అసలు తెలుగు వారి చరిత్ర ఆమెకు ఎంత వరకు తెలుసో కస్తూరి ఆత్మ పరిశీలిన చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. శతాబ్దాలుగా తెలుగు వారు తమిళనాడులో సెటిలై.. అక్కడి జీవన స్రవంతిలో కలిసిపోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. చరిత్ర చదవినా కూడా ఆ సంగతి తెలుస్తుందని… తమిళనాడులో తెలుగువారి చరిత్ర కేవలం 300 ఏళ్లకు పరిమితం కాలేదని చెబుతున్నారు…

త్రిసముద్ర తోయ పీతవాహన అంటే ఎవరి గుర్రాలైతే మూడు సముద్రాల నీళ్లు తాగాయో అన్న సామెతను చెప్పే… శాతవాహన రాజులు క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండో శతాబ్దం వరకు తమిళ ప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర రాజులుగా పేరు పొందారు. ఆంధ్ర దేశీయ, ఆంధ్ర జాతీయ అని పేరు వచ్చినప్పటి నుంచే తమిళ ప్రాంతంపై ఆధిపత్యం ఉందని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు తమిళనాడును పల్లవ రాజులు పాలించినప్పుడు వాళ్లు కొన్ని తెలుగు ప్రాంతాల్లో కూడా సామంతరాజులను నియమించారు. అప్పుడు చాలా మంది తెలుగు వారు వెళ్లి కాంచీపురం, మహాబలిపురం లాంటి ప్రాంతాల్లో సెటిలయ్యారు. తమిళనాట తెలుగు వారు శతాబ్దాలుగా ఉన్నారనేందుకు అదోక ఉదాహరణ చాలు.. చోళ రాజైన రాజరాజ… ఆంధ్రప్రదేశ్లోని వేంగి చాళుక్యులతో వియ్యం అందుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే తమిళనాడును పాలించిన నాయకార్లు తెలుగువారే. విజయనగర సామ్రాజ్యాకాలంలో తిరుచ్చి,మదురై, వేలూరు ప్రాంతానికి వెళ్లిన తెలుగు వారు అక్కడే స్థిరపడిపోయారు. అలాగే ధర్మపురి, కృష్ణగిరి,హోసూరులో ఉండే తెలుగువారు ఇప్పటి వాళ్లు కాదు.. వాళ్లు ఎప్పుడు సెటిలయ్యారో తెలుసుకోవాలంటే చరిత్ర తెలిసి ఉండాలి..

తెలుగువారు తమిళనాడును తమ జన్మభూమిగా, పుణ్యభూమిగా భావిస్తారు. సామాజిక, ఆర్థిక శక్తిగా ఎదిగారు. రాజకీయాల్లో రాణించారు.తమిళ ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహించినది కూడా తెలుగువారే. అసలు కరుణానిధి కుటుంబం కూడా తెలుగువారేనని చెబుతుంటారు.ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి తమిళనాడులో సెటిలయ్యారు. ఆ సంగతులన్నీ తెలియకుండా… తెలగువారు కడుపు చేతపట్టుకుని వెళ్లి కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారని కస్తూరి మాట్లాడటం ఆమె అజ్ఞానానికి నిదర్శనమని తమిళనాడు తెలుగువారు ఆగ్రహం చెందుతున్నారు. ఇకనైనా కస్తూరు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదేమో…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి