ఎన్నికలంటే ప్రచారాస్త్రాలు. ఆచరణ సాధ్యం కాదని హామీలు. తర్వాత గుర్తులేనట్లుగా ప్రవర్తించడాలు. ఎన్నికలు ఒక పండుగ. పండుగ రోజు పిండివంటలు చేసుకున్నట్లుగా నేతలు హామీలు ఇస్తుంటారు. పిండవంటలైతే తిని హరించుకునే అవకాశం ఉంటుంది. హామీల విషయం మాత్రం అలా కాదు.. వంట చేయడం మరిచిపోయినట్లుగా హామీలు కూడా మరిచిపోతున్నారు..ఎంతైన మన రాజకీయ నాయకులు కదా….
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంతగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అనేక కీలకాంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థి బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయన మాటలు చూస్తుంటే మహా ఎన్నికల్లో గెలుపు బాధ్యత భుజాన వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఐదు హామీలకు ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల ముందు ప్రకటించిన హామీల తరహాలోనే అవి ఉన్నాయి. తెలంగాణంలో గెలిచినట్లుగానే మహారాష్ట్రలో గెలవాలని ఆయన ఎదురు చూస్తున్నారు…
రాష్ట్రంలోని ప్రజలకు 25 లక్షల ఆరోగ్య బీమా, కుల గణన, ప్రజలకు ఉచిత మందులు, ఆడపిల్లలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి ఐదు హామీలు కాంగ్రెస్ అజెండాలో ఉన్నాయి. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 3వేలు, నిరుద్యోగ యువకులకు 4వేలు భృతి లభిస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక మరియు తెలంగాణలలో మాదిరిగానే రాష్ట్రంలో కుల గణనను చేస్తామని, 50% రిజర్వేషన్ అడ్డంకిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర హామీలు తెలంగాణలో బూమరాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ 4016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని యువకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో `తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ రకంగానే ప్రతి నిరుద్యోగికి 11 నెలలు బకాయి పడిన 44,176 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటకలో ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసే ప్రతిపాదన ఉన్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగింది. ఆ మాట డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణలో ఉచిత బస్సు స్కీమ్ కొనసాగిస్తారో లేదో చెప్పాలని జనం నిలదీస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం ఏమిటో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…