సీఎం రమేష్… టీడీపీ నుంచి బీజేపీకి మారిన నాయకుడు. పారిశ్రామికవేత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేత. పెద్ద లాబీయిస్టు అన్న పేరు కూడా ఉంది. ప్రజాబలం లేకపోయినా కూడా ధనబలంతో రాజకీయాలు చేయగల దిట్ట. పార్టీలకు మంచి ఫైనాన్షియర్ కూడా. భారీ కాంట్రాక్టులు చేసే సీఎం రమేష్ చాలా మంది రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు అందుకే 2014లో టీడీపీ ఓడిపోగానే . తెలివిగా కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీలో చేరిపోయాయి. బీజేపీ అగ్రనాయకులకు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుకు చాలా క్లోజ్, అందుకే పార్టీ మారినా కూడా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ కోరలేదు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో సీఎం రమేష్… బీజేపీ తరపున అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.టఫ్ నియోజకవర్గంలో సునాయాసంగా గెలిచిన లోక్ సభ అభ్యర్థి కూడా ఆయనే కావచ్చు. అదృష్టం బావుంటే కేంద్ర మంత్రి అయ్యేవారు. మనోడే కదా.. మంత్రి పదవి ఇవ్వకపోతే ఏమవుతుందని బీజేపీ అధిష్టానం అనుకున్నట్లుగా భావించాల్సి వస్తోంది. మంత్రి పదవి రాకున్నా సీఎం రమేష్ బాధపడలేదు. తన వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగితే చాలని ఆయన అనుకున్నారు…..
కేంద్రంలోని అనేక కమిటీల్లో సీఎం రమేష్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన నిత్యం ఏదోక కమిటీతో పర్యటిస్తూ బీజీగా గడుపుతారు. ఈ క్రమంలో ఇటీవల రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ టూర్ జరిగింది. అందులో సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ వెరైటీగా తోటి సభ్యులకు బహుమతులు ఇచ్చారు. ప్రతీ ఒక్కరికీ ఒక గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. అందులో గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉందని సభ్యులు గుర్తించారు.ఈ కమిటీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు తిరిగి వెళ్లిన తర్వాత గిఫ్ట్ ప్యాక్ తెరిచి చూస్తే అందులో ఆ రెండు ఖరీదైన వస్తువులు కనిపించాయి. కొందరు సంతోషించినా మరికొందరు ఖంగుతిన్నారు. ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఖరీదైన బహుమతులు ఇవ్వడం కరెక్టేనా అని కొందరు ప్రశ్నించారు. మాకు ఎందుకు గిఫ్టులు ఇచ్చావని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడైన బిహార్ ఎంపీ సుదామ ప్రసాద్ ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు.
బిహార్ ఎంపీ సుదామ మరో ప్రశ్నను లేవెనెత్తారు. సీఎం రమేష్ .. తమకు ఇచ్చిన బహుమతులను ప్రజాధనంతో ఇచ్చారా. లేక సొంత డబ్బులతో ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయనకు అందజేసిన గిఫ్ట్ ప్యాక్ను వెనక్కి పంపించేశారు. ఇలాంటి పనులు చేయవద్దని కూడా సుదామ పంపిన లేఖలో రాసినట్లు సమాచారం.ఇదీ సీఎం రమేష్ కు కొంత ఇబ్బందికర వ్యవహారమే అయ్యింది. లేఖ అందిన వారం పది రోజుల తర్వాత అది లీక్ కావడంతో సీఎం రమేష్ కొంత అసహనానికి లోనైనట్లు కూడా తెలుస్తోంది. పైగా స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు బస చేయడానికి ఫైవ్ స్టార్ హోటళ్లు వద్దని కూడా సుదామ ఆ లేఖలో ప్రస్తావించారట. ప్రజా సేవ చేయడానికి వచ్చాం గనుక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయదంటూ ఎంపీ రమేశ్‌కు ఆయన లేఖ రాయడం ఇప్పుడు సంచలనమైంది. అంటే సీఎం రమేష్ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారని బిహార్ ఎంపీ చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనాలు సృష్టించడమే కాకుండా ఢిల్లీ వర్గాల్లో కూడా సంచలమైందని చెప్పక తప్పదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…