సమరసింహారెడ్డి తెలుగు సినిమా హిస్టరీలో ప్రత్యేకమైన అధ్యాయం ఉంది.
బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా మారి నటించిన ఈ చిత్రం తెలుగు నాట బాక్సాఫీస్ తుపాన్ తీసుకొచ్చింది.
ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఇదే టైటిల్ ను కాస్త అటూ ఇటూగా మార్చి వీర సింహారెడ్డి గా తిరిగి తీసుకొస్తున్నాడు గోపీచంద్ మలినేని. మరోవైపు చిరు కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ రౌడీ అల్లుడు మూవీ చాలా స్పెషల్.
ఈ మూవీలో మెగా మాస్ క్యారెక్టర్, చిరు కామెడీ టైమింగ్ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు మెగాఫ్యాన్స్.
చిరును రౌడీ అల్లుడు క్యారెక్టర్ లో చూసేందుకు అభిమానులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆలోటు వాల్తేరు వీరయ్య మూవీతో తీర్చబోతున్నాడు బాబి. ఈ ఇద్దరు దర్శకులు కూడా వారి వారి హీరోలకు వీరాభిమానులు. సమరసింహారెడ్డి రిలీజ్ రోజున దెబ్బలు తిని జైలుకు కూడా వెళ్లాలని ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక చిరు అభిమానిగా బాబి ఏం చెబుతాడో అనేది త్వరలో తెలుస్తుంది. అక్టోబర్ 24న దీపావళి కానుకగా చిరు కొత్త సినిమా టైటిల్ ను అఫీసియల్ గా ప్రకటించబోతున్నాడు బాబి. అదే రోజున టీజర్ కూడా రానుంది. మొత్తానికి సంక్రాంతి పండక్కి చిరు, బాలయ్య తన ఫేవరేట్ క్యారెక్టర్స్ లో రీఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ కు పూనకాలు పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.