– సై అంటే సై అంటున్న టాప్ స్టార్స్
– తెలుగు నుంచి ముగ్గురు , తమిళం నుంచి ఇద్దరు..
ఏ ఇండస్ట్రీ అయినా సరే, సంక్రాంతి సీజన్ అతి పెద్ద వసూళ్ల సీజన్ గా మారింది. ఈవెన్ యావరేజ్ టాక్ వచ్చినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. కరోనాకు ముందు నుంచి ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రెండేళ్లుగా సంక్రాంతి సీజన్ ను కరోనా వైరస్ మింగేస్తూ వస్తోంది. వచ్చే సంక్రాంతికి ఆ ప్రమాదం లేదు. అందుకే తెలుగు,తమిళంలో అగ్ర హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. తెలుగులో చిరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య కొత్త సినిమా వీర సింహా రెడ్డి, ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ ప్రధానంగా విడుదల కానున్నాయి. ఇక తమిళం నుంచి విజయ్ నటిస్తున్న వారసుడు, అలాగే అజిత్ కొత్త సినిమా తునీవు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అజిత్ తునీవు సినిమా తెలుగు రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాని విజయ్ మూవీ వారసుడు చిత్రాన్ని స్వయంగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. అందుకే తెలుగు నాట ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఐదుగురితో పాటు అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న న్యూ మూవీ ఏజెంట్ కూడా సంక్రాంతికే రానుందని బాగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సంక్రాంతి ఫైట్ మరింత ఆశక్తికరంగా మారుతుంది.