అందుకే ఆ దర్శకుడితో సినిమా ?
పొలిటికల్ థ్రిల్లర్ తో మెప్పిస్తాడా?
థ్యాంక్యూ ఫెయిల్యూర్ ను నాగ చైతన్య కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు.
అందుకే తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ ను డిఫరెంట్ గా కోరుకుంటున్నాడు.
కొత్త క్యారెక్టర్స్ లో కనిపించి సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు.
ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలసి తెలుగు, తమిళ చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా స్టార్ కాస్ట్ ప్రస్తుతం నాగ చైతన్య ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.
అరవింద్ స్వామి, జీవా, శరత్ కుమార్, కృతిశెట్టి, వెన్నెల కిషోర్, ప్రియమణి, కార్తిక దీపం ఫేమ్ వంటలక్క,
తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే వెంకట్ ప్రభుతో సినిమా తర్వాత,
సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడు.
అలాగే విరాటపర్వం మేకర్ వేణు ఊడుగుల దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాలనుకుంటున్నాడట.
విరాటపర్వంను వేణు ఊడుగుల తెరకెక్కించిన విధానం చైకి బాగా నచ్చిందట.
అందుకే వేణుతో ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేయాలనుకుంటున్నాడట.
వచ్చే ఏడాది ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.