వెరైటీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. అది మర్యాదపూర్వకమైన లంచ్ మీటింగ్ అని చెబుతున్నప్పటికీ.. అసలు కారణం వేరే ఉందంటున్నారు. కొత్త సినిమాల కోసమే జగన్, వర్మ భేటీ అయ్యారట. మొత్తం మూడు సినిమాలను ఎన్నికల్లో తమకు మేలు కలిగేలా ఆర్జీవీతో నిర్మింపచేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పొత్తులు పెట్టుకునే అవకాశాలున్నాయి. ఆ పొత్తును టార్గెట్ చేసేలా ఓ సినిమా తీయబోతున్నారని సమాచారం. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై కూడా ఒక సినిమా రావచ్చు. మరో సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి ఆర్జీవీ తీస్తున్న సినిమాలు ఆడటం లేదు.. అయినా వైసీపీ వర్గాలు ఆయనపై ఎందుకు నమ్మకం పెట్టుకున్నాయో తెలియాల్సి ఉంది..