రాజకీయాల్లో “వర్మ” హీట్
జగన్ తో భేటీపై రాష్ట్రంలో తీవ్ర చర్చ
మరో పొలిటికల్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ
తన “వ్యూహం” ప్రకటించిన ఆర్జీవీ
ఏపీలో మళ్లీ సినీ పాలిటిక్స్ మొదలయ్యాయి. గతంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రాంగోపాల్ వర్మ…మరో పొలిటికల్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. నిన్న తాడేపల్లిలో సడన్ గా ప్రత్యక్షమైన ఆర్జీవీ… సీఎం జగన్ ను సీక్రెట్ గా కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. ఆ భేటీకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంతో….ఆయన వైసీపీ కోసం పొలిటికల్ రిలేటెడ్ మూవీ తీయనున్నారనే ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే, మరుసటి రోజే వ్యూహం పేరుతో రాంగోపాల్ వర్మ వదిలిన వరుస ట్వీట్లు రాష్ట్రంలో కాక పెంచాయి.
త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీయ్యబోతున్నానంటూ కీలక ప్రకటన చేశారు ఆర్జీవీ. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు. కానీ ఈ రియల్ పిక్‌లో వందశాతం నిజాలే ఉంటాయని ట్వీట్ చేశారు. ఆ కాసేపటికే…అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది అంటూ మరో ట్వీట్ వదిలారు. వ్యూహం, శపథం అనే రెండు పార్ట్ లతో సినిమా ఉంటుందన్న ఆర్జీవీ… రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయన్నారు. ప్రజలు వ్యూహం షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 శపథంలో తగులుతుందంటూ హై ఓవోల్టేజ్ తో కూడిన ట్వీట్లు చేశారు. ఎలక్షన్ కోసమేనంటూ తెలుగు ప్రజల్లో ఓ రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.
ఆర్జీవీ ట్వీట్స్‌పై రాష్ట్రంలో తీవ్ర చర్చే జరుగుతోంది. వర్మ తాను తీయబోయే సినిమా గురించే జగన్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఏపీ పాలిటిక్స్ పై ఆర్జీవీ తీసిన సినిమాలు… ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయనే చెప్పాలి. ఓ పార్టీ ఆయనపై బహిరంగంగానే దుమ్మెత్తిపోసింది. వర్మకు కావాల్సింది కూడా అదే. కాంట్రవర్సీ, కన్ఫ్యూజన్ ఈ రెండు ఉంటేనే వర్మకు కిక్కు వస్తుందేమో. తీసిన ప్రతి సినిమాలో వినోదం కన్నా వివాదమే వెతుక్కుంటాడు. ప్రస్తుతం ఆర్జీవీ వ్యూహం ఏవిధంగా ఉండబోతుంది?అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లక్ష్యంగా వైసీపీకి అనుకూలంగా వర్మ వ్యూహం ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.